ఒకప్పుడు సినిమాలు 100 రోజులు ఆడేవి అలాగే కలెక్షన్స్ కూడా అన్ని రోజులు వస్తూనే ఉండేది కానీ ప్రస్తుతం మాత్రం వీకెండ్ డేస్ కలెక్షన్స్ సినిమా స్ట్రెంత్ ను క్యాలిక్యులేట్ చేసేస్తున్నాయి అందులోనూ ముఖ్యంగా ఓపెనింగ్ డే కలెక్షన్స్ ఇంకా ముఖ్యం. అయితే ఈ ఏడాది విడుదలైన మన టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు తెలుగు స్టేట్స్ లో ఎంత వసూలు చేశాయో ఒకసారి చూద్దాం..
ఈ రోజుల్లో ఫస్ట్ డే కలెక్షన్స్ సినిమాను నిర్ణయించేస్తున్నాయి ఈరోజు వచ్చే కలెక్షన్స్ బట్టి ఒక్కోసారి సినిమా రేంజ్ కూడా మారిపోతూ ఉంటుంది అయితే ఈ ఏడాది విడుదలైన సినిమాల్లో ఫస్ట్ డే కలెక్షన్స్ ఎక్కువగా వసూలు చేసిన సినిమా ఆర్‌ఆర్‌ఆర్.. ఈ సినిమా ఏకంగా రూ.105కోట్లు వసూలు చేసింది. అలాగే ఇది ప్రపంచ వ్యాప్తంగా తొలి రోజు రూ.223కోట్లకుపైగా కలెక్షన్లని రాబట్టింది.
అలాగే మహేష్‌బాబు నటించిన `సర్కారు వారి పాట` తొలి రోజు తెలుగు స్టేట్స్ లో రూ.50కోట్లు వసూలు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా రూ.75కోట్లు కలెక్ట్ చేసింది.
అలాగే మెగాస్టార్ చిరంజీవి తన తనయుడు రామ్‌చరణ్‌తో కలిసి నటించిన `ఆచార్య` చిత్రం తొలి రోజు భారీ ఓపెనింగ్స్ ని తీసుకుంది.. రూ.40కోట్లు వసూలు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా యాభై కోట్లకుపైగా ఫస్ట్ డే కలెక్ట్ చేసింది. అయితే ఈ సినిమా అనుకున్న స్థాయిలో విజయాన్ని సాధించలేకపోయింది.
తర్వత స్థానంలో పవన్ కళ్యాణ్ నటించిన `భీమ్లా నాయక్` ఉంది.. ఈ సినిమా తొలిరోజు తెలుగు స్టేట్స్ లో రూ.38కోట్లు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా నాలభై కోట్లకుపైగానే చేసింది. అలాగే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఐదో స్థానానికే పరిమితమయ్యారు. ఆయన నటించిన `రాధేశ్యామ్` 37కోట్లు వసూలు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఇది ఎనభై కోట్లకుపైగానే ఫస్ట్ డే కలెక్షన్లని రాబట్టింది..