కరోనా పై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం

-

ప్రపంచ దేశాలలో మళ్ళీ కరోనా కేసులు అకస్మాత్తుగా పెరుగుతుండడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రపంచ దేశాలలో వైరస్ పరిస్థితిలపై అంచనా వేసేందుకు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించింది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్ సుఖ్ మండవీయ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో నీతి అయోగ్ సభ్యుడు డాక్టర్ వికె పాల్, జాతీయ టీకా సాంకేతిక సలహా బృందం చైర్మన్ ఎన్.ఎల్ అరోడా, ఉన్నతాధికారులు, బయోటెక్నాలజీ విభాగాల అధికారులు పాల్గొన్నారు.

పలు దేశాలలో ఉత్తన్నమవుతున్న కోవిడ్ కొత్త వేరియంట్ లపై అధికారులు సమీక్షలో చర్చించారు ఇకపై కరోనా పరిస్థితిలను చర్చించి చర్యలు తీసుకునేందుకు ప్రతి వారం ఈ ఉన్నత స్థాయి కమిటీ భేటీ కావాలని నిర్ణయించారు. ప్రపంచ దేశాలలో కొత్త కేసులు పెరుగుతున్న వేళ అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని, నిఘాలు మరింత కట్టుదిట్టం చేయాలని కేంద్రం మంత్రి మనసుక్ మాండవియా ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Latest news