ఈ ఏడాది IMDB జాబితాలో నిలిచిన టాప్ సినిమాలివే..

-

ఇంటర్నెట్ డేటాబేస్ వారు(IMDB) ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ప్రతీ సినిమాతో పాటు వెబ్ సిరీస్ కు ప్రేక్షకుల నుంచి వచ్చే స్పందన ఆధారంగా రేటింగ్ ఇస్తారు. అలా ఈ రేటింగ్ ను కొందరు ప్రామాణికంగా భావిస్తారు కూడా. ఈ రేటింగ్ బాగుంటే తప్పకుండా ఫిల్మ్ చూడాలి..అని అనుకుంటుంటారు కొందరు సినీ లవర్స్. అలా ఈ ఏడాది..అనగా 2022లో చక్కటి రేటింగ్ దక్కించుకున్న టాప్ సినిమాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

 

ప్రజెంట్ భాషలతో సంబంధం లేకుండా కంటెంట్ యూనిక్ అయితే చాలు..ఇండియా వైడ్ గా ఫిల్మ్స్ అన్నీ కూడా చాలా బాగా ఆడుతున్నాయి. దేశవ్యాప్తంగా సినీ లవర్స్ యూనిక్ కంటెంట్ కోసం ఎదరు చూస్తున్నారు. అలా ఐఎండీబీ ..లిస్ట్ లో నిలిచిన ఇండియన్ మూవీస్ ఇవి అని చెప్పొచ్చు. RRR, KGF2, విక్రమ్, ద కశ్మీర్ ఫైల్స్, థర్స్ డే, జుండ్, రన్ వే 34, హృదయం, గంగుబాయి కతియావాడి.

దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన విజ్యువల్ గ్రాండియర్ RRR..పిక్చర్ చూసి ప్రపంచం ఫిదా అయింది. టాలీవుడ్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ అయిన రామ్ చరణ్, తారక్ కలిసి నటించిన ఈ మూవీ..బాక్సాఫీసు రికార్డులన్నిటినీ తిరగరాసింది. ఈ ఫిల్మ్ కు ఐఎండీబీ 8 రేటింగ్ ఇచ్చింది. ఇక ఇటీవల విడుదలైన కమల్ హాసన్ నట విశ్వరూపం ‘విక్రమ్’ పిక్చర్ కు 8.8 రేటింగ్ ఇచ్చింది ఐఎండీబీ.

కేజీఎఫ్ చాప్టర్ 2 కు ఐఎండీబీ 8.8 రేటింగ్ ఇవ్వగా, ఆ రేటింగ్ చూసి జనాలు వావ్ అన్నారు. ఇక ఈ పిక్చర్ ప్రజలకు బాగా నచ్చింది కూడా. చిన్న సినిమాగా వచ్చిన ‘ద కశ్మీర్ ఫైల్స్’ కూడా బాక్సాఫీసు వద్ద వసూళ్లు కురిపించింది. దీనికి 8.3 రేటింగ్ ఇచ్చింది ఇంటర్నెట్ డేటాబేస్.

మాలీవుడ్ కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ తనయుడు ప్రణవ మోహన్ లాల్ నటించిన తొలి చిత్రం ‘హృదయం’ సూపర్ హిట్ అయింది. ఈ లవ్ స్టోరికి ఐఎండీబీ 8.1 రేటింగ్ ఇచ్చింది. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ‘జుండ్’కు 7.4 రేటింగ్ ఇచ్చిన ఐఎండీబీ, అజయ్ దేవగణ్ ‘రన్ వే 34’, అక్షయ్ కుమార్ ‘సామ్రాట్ పృథ్వీరాజ్’కు 7.2 రేటింగ్ ఇచ్చింది. ఆలియా భట్ ‘గంగుబాయి కతియావాడి’ పిక్చర్ కు 7.0 రేటింగ్ ఇచ్చింది ఐఎండీబీ.

Read more RELATED
Recommended to you

Latest news