పెట్రోల్‌పై పన్నులు తగ్గించిన రాష్ట్రాలివే!!

-

కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. దీంతో అధిక భారంతో అలమటిస్తున్న ప్రజలకు కాస్త ఊరట లభించిందని చెప్పుకోవచ్చు. లీటర్ పెట్రోల్‌పై రూ.8, డీజిల్‌పై రూ.6 వరకు పన్నును తగ్గించినట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా కేంద్రం బాటలోనే పలు రాష్ట్రాలు పెట్రోల్, డీజిల్‌పై పన్నులు తగ్గించాయి. రాజస్థాన్, మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాలు ఇంధన ధరలపై పన్నును తగ్గించినట్లు ప్రకటించాయి.

పెట్రోల్-డీజిల్

మహారాష్ట్రలో లీటర్ పెట్రోల్‌పై రూ.2.08, డీజిల్‌పై రూ.1.44 మేర పన్ను తగ్గించారు. దీని వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి రూ.2500 కోట్ల అదనపు భారం పడనుంది. అలాగే రాజస్థాన్‌లో కూడా లీటర్ పెట్రోల్‌కు రూ.2.48, డీజిల్‌పై రూ.1.16 మేర వ్యాట్ తగ్గించారు. దీంతో రాజస్థాన్‌లో లీటర్ పెట్రోల్‌పై రూ.10.48, డీజిల్‌పై రూ.7.16 తగ్గనున్నట్లు సీఎం అశోక్ గెహ్లోత్ తెలిపారు. అలాగే కేరళ రాష్ట్రంలో కూడా లీటర్ పెట్రోల్‌పై రూ.2.41, డీజిల్‌పై రూ.1.36 మేర వ్యాట్ తగ్గించారు. వ్యాట్, ఇతర పన్నులను తగ్గించడంతో ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా పెట్రోల్, డీజిల్ ధరలు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version