సాధారణంగా సినీ ఇండస్ట్రీలో ఉండే నటీనటుల మధ్య ప్రేమ అనేది ఎప్పుడు ఎలా పుడుతుందో చెప్పడం చాలా కష్టం. అయితే కొంతమంది ప్రేమించి వివాహం చేసుకుంటే.. మరి కొంత మంది పెద్దలు కుదిర్చిన వివాహాలను చేసుకుంటూ ఉంటారు. మరికొంతమంది ఇక్కడ అబ్బాయిలు లేరన్నట్టుగా విదేశీ ఎన్నారై లను కూడా వివాహం చేసుకున్నారు. ఇక ఇలాంటి వారిలో తెలుగు హీరోయిన్స్ చాలామంది ఉన్నారు. కులం, మతం , జాతి , ప్రాంతీయ వర్గ భేదాలు లేవని నిరూపించారు. ఇక తెలుగమ్మాయిలైన హీరోయిన్స్ విదేశీ అబ్బాయిలను పెళ్లి చేసుకొని ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు. ఇప్పటికీ కూడా చాలా మంది అమ్మాయిలకు తమ తల్లిదండ్రులు ఎన్ ఆర్ ఐ సంబంధం తీసుకొస్తున్న విషయం తెలిసిందే.
మాధవి:
దర్శకరత్న దాసరి నారాయణరావు దర్శకత్వంలో వెండితెరకు పరిచయమైన హీరోయిన్లలో మాధవి కూడా ఒకరు. ఇక కమలహాసన్ నటించిన మరోచరిత్ర సినిమాలో అచ్చు తెలుగమ్మాయి మాధవి మంచి గుర్తింపు సంపాదించుకుంది. తెలుగు , తమిళ్, మలయాళం , కన్నడ, హిందీలో కూడా నటించి మెప్పించిన మాధవి తెలుగమ్మాయి అయినప్పటికీ భారత – జర్మనీ సంతతికి చెందిన రాల్ఫ్ శర్మ అనే ఫార్మాస్యూటికల్ వ్యాపారిని 1996లో వివాహం చేసుకుంది . ప్రస్తుతం న్యూ జెర్సీలో సెటిల్ అయిన ఈయనకు ముగ్గురు పిల్లలు ఉన్నారు.
రంభ:
విజయవాడకు చెందిన అచ్చు తెలుగమ్మాయి స్టార్ హీరోయిన్ రంభ దక్షిణాదిలోని అన్ని భాషా చిత్రాలలో కూడా నటించి మెప్పించింది. ఇక ఈమె కూడా 2010లో కెనడాకు చెందిన ఇంద్రకుమార్ అనే వ్యక్తిని వివాహం చేసుకొని అక్కడే సెటిల్ అయింది.
విజయవాడ నుంచి వచ్చిన మరొక తెలుగమ్మాయి లయ.. తెలుగులో సీనియర్ హీరోల అందరి సరసన నటించి మెప్పించింది. ఇక ఈమె ప్రముఖ ఎన్నారై కాలిఫోర్నియా కి చెందిన డాక్టర్ శ్రీ గణేష్ గోర్టీ ను 2006లో వివాహం చేసుకుంది. వీరికి ఒక పాప, బాబు కూడా ఉన్నారు.