నాగ చైతన్య తో వివాహం, విడాకుల తర్వాత సమంత పూర్తిగా మారిపోయిందని చెప్పవచ్చు. సమంత తన భర్త నుంచి విడాకులు తీసుకున్న తర్వాత పూర్తిస్థాయిలో విమర్శల పాలైందే తప్ప ఎవరూ కూడా ఆమెను అర్థం చేసుకోలేదు. అయితే ఆమె తన బాధను వ్యక్తపరచు కోలేక ఇన్స్టాగ్రామ్ ద్వారా పలు పోస్టులు చేస్తూ తన బాధను వ్యక్తపరిచింది. ఇక పోతే సమంత గురించి ఎవరికీ తెలియని అతి పెద్ద నిజాలను ఇప్పుడు మనం చదివి ఒక సారి తెలుసుకుందాం.
సమంత విడాకులు తీసుకోవడానికి కారణం ది ఫ్యామిలీ మాన్ టూ వెబ్ సిరీస్ అని చెప్పవచ్చు ఎందుకంటే ఈ సినిమాలో చాలా బోల్డ్గా , ఢీ గ్లామరస్ గా కనిపించడం అక్కినేని కుటుంబీకులకు ఏమాత్రం నచ్చలేదు.. ఒకవేళ ఆమె ఈ సినిమాలో నటించకపోయినా ఉండి ఉంటే ఖచ్చితంగా తన భర్త కి దూరం అయి ఉండేది కాదు. ఇక బాలీవుడ్ వైపు వెళ్లి అక్కడ అసభ్యకరమైన పాత్రలు పోషించడం వల్లే నాగచైతన్య , సమంత పైన నమ్మకం పోయిందట.
అంతేకాదు 14 సంవత్సరాల పాటు ఎంతో జాగ్రత్తగా బిల్డ్ చేసుకున్న తన కెరియర్ ను ఉన్నట్టుండి వివాహం అనే పేరుతో పూర్తిగా దూరం అయ్యింది. ఇక ఆమెలో ఉన్న ఆ కల ముగిసిపోయింది అని అందరూ అనుకున్నారు. కానీ తన భర్తతో విడాకులు తరువాత ఆమెలో ఉన్న ప్రతి మళ్లీ బయటకు వచ్చి అభిమానులకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ప్రస్తుతం పాన్ ఇండియా హీరోయిన్ మాత్రమే కాదు ఇంటర్నేషనల్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తోంది సమంత.సమంత ఒక చర్మ వ్యాధి తో బాధపడుతున్నట్లు.. పదినిమిషాల కంటే మించి ఎండలో నిలబడలేనట్లు సమాచారం. అయితే ఈ సమస్యకు చికిత్స లేదట.
సమంత , నాగచైతన్య ఇద్దరూ కలిసి మొత్తం 3 సినిమాలలో నటించారు ఏమాయ చేసావే సినిమా ద్వారా పరిచయమైన వీరిద్దరూ మజిలీ సినిమాతో చివరిసారిగా వీరు నటించారు. కేవలం హీరోయిన్ గా మాత్రమే కాకుండా సామ్ జామ్ పేరిట ఒక సెలబ్రిటీ షో ని కూడా నిర్వహించింది. అంతేకాదు బిగ్ బాస్ లో ఒకరోజు అవుట్ షూటింగ్ పేరిట నాగార్జున వెళ్లగా ఆ ప్లేస్ లో సమంత వచ్చి సందడి చేసింది. హలో బుల్లితెర ప్రేక్షకులను బాగా సందడి చేసింది ఈ ముద్దుగుమ్మ.