అమ్మో.. ఈ బ్లడ్ గ్రూప్స్ వారికే హార్ట్ ఎటాక్ రిస్క్ ఎక్కువట..!

-

నేడు గుండె సమస్యలు ఏ విధంగా ఉన్నాయో మనందరికీ తెలుసు.. ఏజ్ తో సంబంధం లేకుండా హార్ట్ ఎటాక్స్ వస్తున్నాయి. ఈ ఏజ్ వారికే ఈ రోగాలు వస్తాయి అని ఒకప్పుడు ఉండేది.. కానీ.. మారుతున్న కాలంతో పాటు.. జబ్బులు కూడా వాటి టైమింగ్స్ మార్చాయి.. అయితే హార్ట్ ఎటాక్స్ రావడానికి.. కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ కారణం అని మనకు తెలుసు.. దీంతో పాటు.. బ్లడ్ గ్రూప్స్ ఆధారంగా.. కూడా హార్ట్ ఎటాక్స్ వచ్చే రిస్క్ ఉంటుందట. బ్లడ్ గ్రూప్, గుండె ఆరోగ్యం ఒకదానితో ఒకదానికి సంబంధం ఉంది. ABO రక్త వ్యవస్థ నుంచి, ఏటైప్ బ్లడ్ గ్రూప్‌లోని వ్యక్తులు గుండె జబ్బులకు ఎక్కువగా గురవుతారో కనుగొనవచ్చని పరిశోధకులు అంటున్నారు.

A, B బ్లడ్ గ్రూపులు ఉన్నవారికి థ్రోంబోఎంబాలిక్ వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని..2020వ సంవత్సరంలో అమెరికన్ హార్ట్ అసోసియేషన్ జర్నల్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం చెబుతుంది. అయితే O బ్లడ్ గ్రూప్ ఉన్నవారి కంటే రక్తపోటు ప్రమాదం తక్కువగా ఉన్నట్లు కనుగొన్నారు.

O బ్లడ్ గ్రూప్ ఉన్నవారి కంటే A బ్లడ్ గ్రూప్ ఉన్నవారికి హైపర్లిపిడెమియా, అథెరోస్క్లెరోసిస్, గుండె వైఫల్యం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని అధ్యయనంలో తేలింది. అయితే B బ్లడ్ గ్రూప్ ఉన్నవారికి O ఉన్నవారి కంటే గుండెపోటులు రావాని కాదు.. A బ్లడ్ గ్రూప్ ఉన్నవారిలో గుండె వైఫల్యం, స్లీప్ అప్నియా, అథెరోస్క్లెరోసిస్, హైపర్లిపిడెమియా, అటోపీ ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది.

ఎందుకు ఇలా జరుగుతుంది?

నాన్-విల్‌బ్రాండ్ ఫ్యాక్టర్‌లో వ్యత్యాసం కారణంగా ఇది జరిగిందని పరిశోధకులు భావిస్తున్నారు. ఇది రక్తం గడ్డకట్టే ప్రోటీన్, ఇది థ్రోంబోటిక్ సంఘటనలలో కీలక పాత్ర పోషిస్తుంది. నాన్-ఓ బ్లడ్ గ్రూపులు ఉన్న వ్యక్తులు నాన్-విల్‌బ్రాండ్ ఫ్యాక్టర్ అధిక సాంద్రత కారణంగా రక్తం గడ్డకట్టే అవకాశం ఉందని తెలిపారు. అయితే ఇది O బ్లడ్ గ్రూప్ ఉన్నవారిలో ఉండదు. నాన్-ఓ బ్లడ్ గ్రూపులు ఉన్న వ్యక్తులకు జీర్ణశయాంతర రక్తస్రావం, హైపర్‌టెన్షన్ వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుందని అధ్యయనం వెల్లడించింది. కానీ నాన్-ఓ బ్లడ్ గ్రూపులు ఉన్నవారిలో

అంటే O‌ బ్లడ్ గ్రూప్ ఉన్నవారు ఆరోగ్యంగా ఉండే అవకాశం ఎక్కువ. మిగతవారికి జబ్బులు ఎక్కువగా వస్తాయి.. ముఖ్యంగా ఏ గ్రూప్ వారికి గుండెపోటు వచ్చే అవకాశం ఉందని.. అధ్యయనంలో తేల్చారు.

Read more RELATED
Recommended to you

Latest news