రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి వ్యాక్సిన్ వేసుకుంది ఎవరెవరంటే ? 

-

ఇండియా వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభంమైంది. వర్చువల్‌ విధానంలో ప్రధాని మోడీ కరోనా టీకా ప్రక్రియను ప్రారంభించిన అనంతరం హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి, రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ కలిసి ప్రారంభించారు. అయితే గాంధీ ఆస్పత్రిలో సఫాయి కర్మచారి కృష్ణమ్మ మొదటి టీకా వేసుకుంది.

తెలంగాణలో టీకా వేసుకున్న మొదటి వ్యక్తిగా కృష్ణమ్మ రికార్డుల్లోకి ఎక్కింది. ఇక ఏపీ విషయానికి వస్తే విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో వాక్సినేషన్ కార్యక్రమానికి సీఎం  వైయస్ జగన్ హాజరయ్యారు. రాష్ట్రంలో తొలిగా సానిటరీ వర్కర్ బి పుష్ప కుమారి కి కరోన వ్యాక్సిన్ వేశారు వైద్య సిబ్బంది. పుష్పకుమారికి 0.5 మిల్లి డోసుల వాక్సిన్ ఇచ్చారు వైద్య సిబ్బంది.  వ్యాక్సినేషన్ భద్రపరిచిన క్యారియర్ బాక్సులను సీఎం జగన్ పరిశీలించారు. రాష్ట్రవ్యాప్తంగా 332 కేంద్రాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. 

Read more RELATED
Recommended to you

Latest news