ప్రతి నెలా 1వ తేదీ నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు కొత్త రూల్స్‌ను అమలులోకి తెస్తాయన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే జూన్ 1 నుంచి కేంద్రం పలు మార్పులు చేయనుంది. సుకన్య సమృద్ధి యోజనతోపాటు ఎల్‌పీజీ సిలిండర్ ధరలను మార్చనుంది. అందులో భాగంగానే జూన్ 1 నుంచి చోటు చేసుకోనున్న మార్పుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. ఇన్‌కమ్‌ట్యాక్స్ విభాగానికి చెందిన ఇ-ట్యాక్స్ ఫైలింగ్ సైట్ జూన్ 1 నుంచి 6వ తేదీ వరకు అందుబాటులో ఉండదు. 7వ తేదీ నుంచి కొత్త వెబ్‌సైట్ అందుబాటులోకి వస్తుంది. అందువల్ల కొత్త వెబ్‌సైట్‌ను ఉపయోగించుకోవాల్సి ఉంటుంది.
2. బ్యాంక్ ఆఫ్ బరోడా తన కస్టమర్లకు పాజిటివ్ పే విధానాన్ని అందుబాటులోకి తేనుంది. ఈ క్రమంలో రూ.2 లక్షలు ఆపైన విలువ కలిగిన చెక్కులను ఇస్తే వాటిని మార్చేటప్పుడు బ్యాంకు వారు ఖాతాదారులను మరోసారి వివరాలను కన్‌ఫాం చేయాలని అడుగుతారు.
3. జూన్ 1వ తేదీ నుంచి వంట గ్యాస్ సిలిండర్ ధర మారనుంది. ప్రతి నెలా 1వ తేదీన ఆ ధర మారుతుంది. కనుక ఆ రోజు కొత్త ధరను ప్రకటించే అవకాశం ఉంది. అయితే కొన్నిసార్లు ఈ ధరను మార్చకపోవచ్చు. ప్రస్తుతం 14.2 కిలోల ఎల్‌పీజీ సిలిండర్ ధర ఢిల్లీలో రూ.809గా ఉంది.
4. జూన్ 1వ తేదీ నుంచి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పీపీఎఫ్, ఎన్ఎస్‌సీ, కేవీపీ, సుకన్య సమృద్ధి యోజన పథకాలకు చెందిన వడ్డీ రేట్లు మారుతాయి.