వాస్తు: ఇంట్లో లైటింగ్ విషయంలో ఈ నియమాలను పాటించాలి..

-

చాలా మంది ఇంట్లో ప్రతి వస్తువు అందంగా ఉండాలని అనుకుంటారు..ముఖ్యంగా ఇల్లు అందంగా అలరింకరించు కోవడం లో ఎక్కువ సమయాన్ని చాలా మంది కేటాయిస్తారు.వారి ఎలాగైతే కలలు కన్నారో అలాగే ఇంటిలో ప్రతి ఒక్క దానిని డిజైన్ చేసుకుంటారు. షాన్డిలియర్స్, సైడ్ ల్యాంప్స్, డ్యాన్సింగ్ లైట్లు ఇలా అనేక రకాల లైటింగ్‌లను వేర్వేరు ప్రదేశాల్లో ఏర్పాటు చేసుకుంటారు..

ప్రకాశవంతం చేయడమే కాకుండా, సానుకూల శక్తిని కూడా ప్రవహింపజేస్తుంది. వాస్తు శాస్త్ర నియమాలు సూర్యరశ్మిపై ఆధారపడి ఉంటాయి కాబట్టి.. అటువంటి పరిస్థితిలో.. ఇంటిలోని ప్రతికూలతను తొలగించడానికి, ఇంటికి కృత్రిమ లైటింగ్ విషయంలో కూడా వాస్తు నియమాలను పాటించాలి. వాస్తు ప్రకారం, ఇంట్లో ఏ భాగంలో, దీపాలు, బల్బులు మొదలైనవి ఏర్పాటు చేసుకోవడం ద్వారా సుఖ, సంతోషాలు కలుగుతాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

*. హాల్ లేదా లివింగ్ రూమ్ ఉత్తర దిశలో ట్యూబ్ లైట్లు అమర్చడం మంచిదని భావిస్తారు. ఇలా చేయడం వల్ల ఇంట్లో శాంతి నెలకొంటుందని, వివాదాలు లేకుండా ప్రశాంత వాతావరణం ఉంటుందని నమ్మకం.

*. మంచం ఎదురుగా ఉన్న గోడపై లైట్స్ పెట్టుకోవాలి. ఇది అదృష్టమని భావిస్తారు. భార్యాభర్తల మధ్య ప్రతికూలత దూరంగా ఉంటుంది. అదే సమయంలో.. బెడ్ రూమ్ లో దక్షిణం వైపు దీపాలు పెట్టడం మానుకోవాలి..

*. వంటగదిలో తూర్పు దిశ చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. వంటగదికి తూర్పు దిక్కున బల్బు పెడితే ఇంట్లో తిండికి, ధనానికి, ధాన్యానికి లోటు ఉండదని చెబుతారు. అంతే కాకుండా వాస్తు నియమాల ప్రకారం సాయంత్రం అయ్యాక ఇంట్లోని అన్ని దీపాలను కాసేపు వేయడం వలన ఇంట్లో సానుకూలత వాతావరణం ఏర్పడుతుందని నమ్ముతారు.

రంగు రంగుల లైట్లను పూజ గదిలో ఏర్పాటు చేసుకోవడం మేలు..ఏకాగ్రతకు భంగం కలిగిస్తుంది. మనస్సు ప్రశాంతంగా ఉండదు. పూజ గదిలో రంగుల దీపాలే కాకుండా జీరో బల్బులను కూడా ఉపయోగించవచ్చు. ఇంటి ఇతర ప్రాంతంల్లో లేత తెలుపు రంగు బల్బ్ ని పెట్టుకోవాలి..మంచిది..ఇలాంటివి గుర్తు పెట్టుకోని లైట్లు పెట్టుకోవడం మంచిది..

Read more RELATED
Recommended to you

Latest news