ఇది తాలిబన్ రాజ్యం.. మనం ఉంటున్నది అప్గన్ లో – వైయస్ షర్మిల సంచలనం

-

వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి పై మండిపడ్డారు. పద్మ దేవేందర్ రెడ్డిని రెండుసార్లు గెలిపించారు కదా.. ఏమైనా చేశారా? అని ప్రశ్నించారు. భార్యాభర్త అన్నింట్లో సగం – సగం అంటారు.. ఆ పాయింట్ ని పద్మాదేవేందర్ రెడ్డి చాలా సీరియస్ గా తీసుకున్నారని ఎద్దేవా చేశారు.

“అధికారం, పెత్తనం మొత్తం భర్తదేనంట కదా!. ఆయనకు దోచుకోవడమే పని. ఏ పనికైనా కమిషన్ అంట కదా. కమిషన్లు లేకపోతే ఏ పని ముందుకు సాగదట కదా. చివరికి రాష్ట్రంలో కలెక్టర్ బంగ్లాలు పూర్తి అవుతుంటే.. ఇక్కడ మాత్రం పూర్తి కాలేదట కదా. ఎందుకు అంటే కమిషన్లు ఇచ్చుకోలేక కాంట్రాక్టర్ పనులు ఆపేశాడట కదా. అయ్యా నేను చావలేను అని కాంట్రాక్టర్ చేతులు ఎత్తేసాడంట కదా. కోనాపూర్ సొసైటీకి ఎమ్మెల్యే భర్త చైర్మన్ అంట కదా. మొత్తం తినేసాడు అంట కదా.

హైకోర్టు సైతం అవినీతి జరిగింది అని చెప్పిందట. అయినా ఎందుకు కేసు నడపలేదు.. ఎందుకు జైల్లో పెట్టలేదు. ఎమ్మెల్యే భర్తకు ఒక న్యాయం.. ప్రజలకు ఒక న్యాయమా !. ఇది తాలిబన్ రాజ్యం.. మనం ఉంటున్నది ఆఫ్గాన్ లో. వాళ్ళు చెప్పిందే వేదం. ఎక్కడ చూసినా దొంగల రాజ్యం.. దోపిడి రాజ్యం. ఎక్కడ చూసినా మర్డర్లు.. అత్యాచారాలు. చివరికి జర్నలిస్టులను సైతం మాట్లాడనివ్వడం లేదు. వీళ్లకు వ్యతిరేకంగా మాట్లాడితే ఉద్యమ ద్రోహులట”. అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు వైఎస్ షర్మిల.

Read more RELATED
Recommended to you

Latest news