ధనుష్ “సార్” కోసం ఈ మెగా హీరో ఫిక్స్.?

-

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, సంయుక్త మీనన్ కలిసి జంటగా నటిస్తున్న చిత్రం సార్.. వెంకీ అట్లూరి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా బైలింగ్వల్ మూవీ గా తెరకెక్కుతోంది. సూర్యదేవరనాగ వంశీ , సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 17వ తేదీన ఈ సినిమా థియేటర్లలో తెలుగు, తమిళ్ భాషలలో ఒకేసారి విడుదల కాబోతోంది.

ఇప్పటికే విడుదల చేసిన పాటలు యూట్యూబ్లో బాగా ట్రెండ్ అయ్యాయి. జీవి ప్రకాష్ కొట్టిన పాటలు ముఖ్యంగా అందరినీ ఆకట్టుకుంటున్నాయి. నిజానికి ఈ సినిమా నుంచి ట్రైలర్ను తాజాగా విడుదల చేయగా తెలుగు, తమిళ్ భాషల్లో ఈ సినిమా ట్రైలర్ ద్వారానే హిట్ పక్క అంటూ నిరూపిస్తోంది. అయితే, ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ గురించి తాజాగా ఓ వార్త వైరల్ అవుతోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ కు చిరంజీవి రానున్నట్లు సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందట.

Read more RELATED
Recommended to you

Latest news