ఆ రాష్ట్రాలు కర్ఫ్యూ, లాక్‌డౌన్‌ అమలుకు సిద్ధం..!

-

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. రోజురోజుకీ కేసుల సంఖ్య భారీగా పెరగడంతో ఆయా రాష్ట్రాల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 43,846 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. నిన్న ఒక్కరోజే 27 వేలకు పైగా కరోనా కొత్త కేసులు నమోదు అయ్యాయి. అయితే కరోనా కేసుల సంఖ్య పెరగడంతో పలు రాష్ట్రాలు కఠిన ఆంక్షలు విధించే దిశగా అడుగులు వేస్తున్నాయి.

కరోనా
కరోనా

ఈ ఏడాది దేశవ్యాప్తంగా మహారాష్ట్రలోనే ఎక్కువ కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. దీంతో అక్కడి ప్రభుత్వం వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో లాక్‌డౌన్ అమలు చేసింది. అలాగే రాజస్థాన్‌లోని 8 నగరాల్లో కూడా ఈ రోజు నుంచి రాత్రి పూట కర్ఫ్యూ విధించేందుకు సిద్ధం అవుతున్నారు. అదేవిధంగా పంజాబ్‌లోని అమృత్‌సర్ జిల్లాలో రాత్రి పూట కర్ఫ్యూ, మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్, ఇండోర్, భోపాల్‌లో వారాంతపు లాక్‌డౌన్ అమలు చేయనున్నట్లు సమాచారం.

దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 43,846 కరోనా కొత్త కేసులు నమోదు అయ్యాయి. ఇది ఈ ఏడాదిలోనే అత్యధికం. కరోనా బారినపడి నిన్న ఒక్కరోజే 197 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1,59,755కి చేరింది. 22,956 మంది కరోనా నుంచి క్యూర్ అయి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో వీరి సంఖ్య 1,11,30,288కి చేరింది. మహారాష్ట్ర, పంజాబ్, కేరళ, గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్ కరోనా కొత్త కేసుల వాటా 83.14 శాతంగా ఉంది. గడిచిన 24 గంటల్లో మహారాష్ట్రలో 27,126, పంజాబ్‌లో 2,578, కేరళలో 2,078 కరోనా కొత్త కేసులు నమోదు అయ్యాయి.

కర్ఫ్యూ, లాక్‌డౌన్..
సోమవారం నుంచి రాజస్థాన్‌లోని 8 నగరాల్లో రాత్రి 11 నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమలు చేశారు. మధ్యప్రదేశ్‌లోని భోపాల్, ఇండోర్, జబల్‌పూర్ తదితర నగరాల్లో లాక్‌డౌన్ అమలు చేయనున్నారు. పంజాబ్‌లోని అమృత్‌సర్ జిల్లాలో రాత్రిపూట కర్ఫ్యూ, తమిళనాడులో మార్చి 22వ తేదీ నుంచి 9, 10, 11 తరగతులను నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news