జేమ్స్‌ బాండ్ విజయం వెనుక ఆ మహిళలు…!

-

బాండ్‌..జేమ్స్‌ బాండ్ అన్న ఒక్క డైలాగుతో గర్ల్స్ గుండెల్లో ఫిక్స్‌ అయిపోయాడు సీన్‌ కానరీ. బాండ్‌కే బ్రాండ్‌ అంబాసిడర్ అయిన సీన్ కానరీ విజయం వెనుక కూడా మహిళలే ఉన్నారు. ఓ రకంగా చెప్పాలంటే కానరీని రొమాంటిక్‌ అండ్ డైనమిక్‌ హీరోని చేసి అతన్ని వెలుగులోకి తెచ్చింది కూడా మహిళామనులే.

సీన్‌ కానరీ… ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులు మెచ్చిన కథానాయకుడు. అంతకు మించి మహిళలు వెలుగులోకి తెచ్చిన సెక్సీ హోరో కూడా సీన్ కానరీనే.తొలి జేమ్స్‌ బాండ్ చిత్రం డాక్టర్ నెంబర్‌లో బాండ్‌గా కానరీని ఎంపిక చేయడానికి కసరత్తే జరిగింది. రిచర్డ్ బర్టన్‌, క్యారీ గ్రాంట్‌, రెక్స్ హ్యారిసన్, లార్డ్ లూకన్‌ వంటి హీరోలు బాండ్‌ క్యారెక్టర్ కోసం పోటీపడుతున్న సమయంలో సీన్‌ కానరీకే ఓటు వేసింది చిత్ర నిర్మాతల్లో ఒకరైన కబీ బ్రోకలీ భార్య డానా. సీన్ కానరీ పేరును సూచించింది కూడా డానానే. అతడిలో సెక్సువల్‌ కెమిస్ట్రీ, మ్యాగ్నాటిజమ్‌ ఉందని, అతన్నే బాండ్‌గా తీసుకోవాలని నిర్మాతలపై ఒత్తిడి కూడా తీసుకొచ్చింది.

సీన్ కానరీ హీరోగా తొలి జేమ్స్‌ బాండ్ చిత్రం డాక్టర్‌ నంబర్‌ విడుదలయ్యాక తెలిసింది డానా తీసుకున్న నిర్ణయం చరిత్ర సృష్టించింది. సీన్ కానరీని బాండ్ చేసింది డానా బ్రోకలీ అయితే అంతకు ముందు టీవీ సిరీస్‌లు, సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తున్న కానరీని లీడ్‌ యాక్టర్‌ని చేసింది కూడా ఓ మహిళనే కావడం విశేషం. బీబీసీ టీవీ సిరీస్‌ సండే నైట్ థియేటర్‌లో రెక్వియమ్ ఫర్‌ హెవీవెయిట్‌ ఎపిసోడ్ కానరీ బాక్సర్‌గా నటించారు. నిజానికి ఈ పాత్రను హాలీవుడ్ లెజండ్‌ జాక్ పాలన్స్ నటించాలి. కానరీని మహిళలు చాలా ఇష్టపడతారు అంటూ అతన్ని లీడింగ్ రోల్‌లోకి తీసుకొచ్చింది జాక్వలిన్‌.

డాక్టర్ నంబర్ నుంచి డైమండ్స్ ఆర్ ఫరెవర్ వరకూ సీన్ కానరీ ఏడు బాండ్‌ చిత్రాల్లో నటించారు. అయితే తనను ఒకే తరహా పాత్రలకు పరిమితం చేస్తున్నారంటూ ఆన్‌ హర్‌ మెజిస్టీస్‌ సర్వీస్ బాండ్ చిత్రాన్ని తిరస్కరించారు. ఇందులో బాండ్‌గా జార్జ్‌ లాసన్‌బై నటించారు. ఈ సినిమా ఫ్లాప్‌ అవడంతో ఆ తరువాతి చిత్రాలకు భారీ పారితోషికం ఇచ్చి బాండ్‌గా మళ్లీ కానరీనే తీసుకొచ్చారు దర్శకులు. ఆస్కార్ పురస్కారం అందుకున్న కానరీకి హాలీవుడ్ లైఫ్‌ స్టైల్ అంటే నచ్చేది కాదు. స్పెయిన్, పోర్చుగల్, గ్రీస్‌, కరేబియన్ దేశాల్లో గల తన ఇళ్లల్లో గోల్ప్‌ ఆడటమంటే కానరీకి చాలా ఇష్టం.

Read more RELATED
Recommended to you

Latest news