ఎయిర్ ఇండియా ప్రయాణికులకు ఆ సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. ఇక నుంచి అర్హులైన ప్రయాణికులకు 2-3 రోజుల్లోనే టికెట్ రిఫండ్‌లు అందిస్తున్నామని ఎయిరిండియా వెల్లడించింది. కరోనా సమయంలో, ఆ తర్వాత పరిణామాల్లోనూ ప్రయాణాలు రద్దు చేసుకోవడం, సర్వీసులు నిలిచిపోవడంతో, చాలా విమానయాన సంస్థలకు రిఫండ్‌లు సమస్యగా మారాయని సంస్థ తెలిపింది.
ప్రభుత్వ నియంత్రణ నుంచి ఎయిర్ ఇండియా బయటకు వచ్చిన కొన్ని నెలల్లోనే 2.5 లక్షలకు పైగా కేసుల్లో సుమారు రూ.150 కోట్లకు పైగా రిఫండ్‌లు ప్రాసెస్ చేశామని వివరించింది. ప్రస్తుతం అర్హులైన ప్రయాణికులు తమ వెబ్‌సైట్‌లో రిఫండ్ రిక్వెస్ట్ పెట్టిన 2-3 రోజుల్లోనే ప్రాసెస్ చేస్తున్నామని ఎయిర్ ఇండియా వెల్లడించింది. ఎయిర్ ఇండియా ప్రకటనపై ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.