కెనడాలో భారతీయ టిక్‌టాక్ స్టార్ మేఘా ఠాకూర్ మరణం నెట్టింట కలకలం రేపుతోంది. కేవలం 21 వయసులో ఆమె ఆకస్మికంగా మృతి చెందారు.టిక్ టాక్ వీడియోలతో పాపులర్ అయిన సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ మేఘా ఠాకూర్ మృతి చెందినట్లు ఆమె తల్లిదండ్రులు ఇన్సాస్టాగ్రామ్ పోస్ట్ ద్వారా తెలియజేశారు. దాంతో పాటు మేఘా నవంబర్ 24వ తేదీన మరణించినట్టు వెల్లడించారు. భారమైన మనసుతో ఈ విషయం వెల్లడిస్తున్నామన్న ఆమె కుటుంబసభ్యులు.. నవంబర్ 24వ తేదీన తమ జీవితాల్లోని వెలుగు అకస్మాత్తుగా, అనుకోకుండా ఈ లోకం విడిచి వెళ్లిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ కష్టసమయంలో తనకు మీ అందరి ఆశీస్సులు కోరుతున్నామని, మీ ప్రార్థనలు ఆమెకు తోడుగా ఉంటాయంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. అయితే మేఘా మరణానికి కారణం ఏంటన్నది మాత్రం వెల్లడించలేదు. టిక్ టాక్ లో దాదాపు 9.3లక్షల మంది ఫాలోవర్స్ ఉన్న మేఘాకు గత 4 నెలల క్రితమే గుండెపోటు వచ్చింది. అప్పుడు తనకు యాంగ్జైంటీ ఎక్కువని, అందువల్లే ఒత్తిడి ఎక్కువైందని, ఫలితంగా గుండెపోటు వచ్చిందని మేఘా ఓ వీడియో ద్వారా తెలియజేసింది. టిక్‌టాక్ ద్వారా బాడీ పాజిటివిటీ గురించి అవేర్‌నెస్ కల్పిస్తూ పోస్టులు పెట్టే మేఘా.. తన వీడియోల్లో పాపులర్ సెలబ్రిటీలు జైలీ కెన్నర్, బెల్లా హడిడ్ గురించి కూడా చెప్తూ అందర్నీ ఆకట్టుకునేది.