కర్ణాటకలో హిజాబ్ వివాదం రగులుతోంది… తాజాగా టిప్పు సుల్తాన్ వివాదం ప్రారంభం కాబోతోందా…?

-

కర్ణాటకలో హిజాబ్ వివాదం ఇప్పుడిప్పుడే సద్దుమణుగుతోంది. కర్ణాటక హైకోర్ట్ తీర్పుతో పరిస్థితిలో కొంతమార్పు వచ్చింది. ఇదిలా ఉంటే కర్ణాటకలో మరో వివాదం ప్రారంభం కాబోతోందా… అంటే జౌననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు టిప్పు సుల్తాన్ వివాదం కర్ణాటకలో కొత్తగా మొదలువబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. కర్ణాటక పాఠ్యాంశాల్లో టిప్పు సుల్తాన్ గురించి ఉన్న కొన్ని అంశాలను తొలగించేందుకు బొమ్మై సర్కార్ సిద్ధం అవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై విమర్శలు కూడా మొదలయ్యాయి. బసవరాజ్ బొమ్మై ప్రభుత్వం రోహిత్ చక్రతీర్థ ఆధ్వర్యంలో  ఓ కమిటీని నియమించింది. పాఠ్యాంశాల్లో ఉన్న సిలబస్ పై ఈ కమిటీ రివ్యూ చేసింది. అయితే 6 నుంచి 10 తరగతులు పాఠ్యాంశాల్లో టిప్పు జీవిత చరిత్రపై పాఠాలు ఉన్నాయి. అయితే కమిటీ ప్రస్తుతం రిపోర్ట్ ఇచ్చింది. టిప్పు చరిత్ర ఉంచినా…. అందులో టిప్పు కీర్తిప్రతిష్టలకు సంబంధించిన విషయాలను తొలగించాలని కమిటీ సిఫారసు చేసింది. టైగర్ ఆఫ్ మైసూర్ గా టిప్పును పాఠ్యాంశాల్లో కీర్తించారని.. అయితే టైగర్ ఆఫ్ మైసూర్ అనేందుకు ఆధారాలు లేవని కమిటీ సిఫారసు చేసింది. మైసూర్ ఒడయార్ల గురించి మరింత సమాచారాన్ని పాఠ్యాంశాల్లో జోడించాలని కమిటీ సూచించింది. ఈ విషయాన్ని బీజేపీ సమర్థిస్తుంటే.. విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news