పిల్లలను సరైన మార్గంలో పెంచడం ఎంతో కష్టమైన పని అనే చెప్పవచ్చు. ఎందుకంటే పిల్లల పెంపకంలో ఆనందంతో పాటు ఎన్నో సవాళ్లు కూడా ఉంటాయి. ముఖ్యంగా ఈ తరం తల్లిదండ్రులు పిల్లల నడవడికను గమనిస్తూ ఉండాలి. వారి మాట్లాడే విధానం, చేసే పనులు మరియు సరైన దారిలో వెళ్తున్నారా అనేదాన్ని ఎప్పుడూ గమనించాలి. ఇటువంటి విషయాలను తప్పకుండా పట్టించుకుంటే వారు సరైన మార్గంలో ఉంటారు. పిల్లల మనస్తత్వాలను అర్థం చేసుకొని దాని ప్రకారం నడుచుకోవాలి. దానికి ముందుగా ఇంటి వాతావరణం మెరుగ్గా ఉండే విధంగా చూసుకోవాలి.
ఎప్పుడైతే ఇంటి వాతావరణం సరిగా ఉంటుందో పిల్లల వ్యక్తిత్వం మరియు అభివృద్ధి బాగుంటుంది. ముఖ్యంగా తల్లిదండ్రులు గొడవలు పడకుండా ఇంట్లో ఎంతో మంచిగా వ్యవహరించాలి. ఇలా చేయడం వలన పిల్లలు వాటిని చూసి నేర్చుకుంటారు. ముఖ్యంగా ఇతరులకు సహాయం చేయడం, గౌరవం ఇవ్వడం వంటి చిన్నచిన్న విషయాలు కూడా ఎంతో కీలక పాత్ర పోషిస్తాయి అని చెప్పవచ్చు. పిల్లలు చేస్తున్న కొత్త పనులను ప్రోత్సహించాలి. ఎందుకంటే పిల్లల్లో ఉండే ప్రతిభ, నైపుణ్యం తల్లిదండ్రులే కనిపెట్టి వారిని ప్రోత్సహించాలి. ఇలా చేయడం వలన వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మరియు గుర్తింపు కూడా వస్తుంది. చాలామంది తల్లిదండ్రులు చదువు ఎంతో అవసరం అని వారి మార్కుల పై ఒత్తిడి పెడుతుంటారు.
అలా కాకుండా పిల్లల ఆసక్తి గురించి ఆలోచించి, దాని ప్రకారం ప్రోత్సహించాలి. ముఖ్యంగా వారి ఆసక్తి తెలుసుకుని దాని ప్రకారం వ్యవహరించాలి. ఎప్పుడైతే పిల్లలు తల్లిదండ్రుల మాట వినరో, తల్లిదండ్రులు క్రమశిక్షణ కోసం ఎన్నో నిర్ణయాలను తీసుకుంటారు. అటువంటి వాటిలో భాగంగా శిక్షించడం వంటి నిర్ణయాలను తీసుకోవడం వలన ఎంతో ప్రమాదం ఉంటుంది. కనుక సరైన తీరులో వ్యవహరించాలి మరియు సానుకూలంగా ప్రయత్నించాలి. పిల్లల ప్రవర్తన భయపెడుతుంటే ఇటువంటి మార్పులను తప్పకుండా ప్రయత్నించండి. దీంతో మంచి మార్గంలో ప్రయాణించి అభివృద్ధి చెందుతారు.