ఒక్క మాటతో మీ స్వీట్ హార్ట్ ని కూల్ చేయండి..!

-

పెళ్లైన కొత్తలో భార్యాభర్తల మధ్య సముద్రమంత ప్రేమ ఉంటుంది. ఒకరినొకరు విడిచి ఉండలేనంతగా కలిసిపోతారు. చిన్న గొడవ వచ్చిన వెంటనే సారీ చెప్పి క్షణంలో కలిసిపోతారు. ఇదంతా కొత్తలో. కానీ రోజులు గడుస్తున్నకొద్ది భార్యాభర్తల మధ్య ప్రేమ తగ్గుతుంది. ఎందుకంటే బాధ్యతలు వస్తాయి. లైఫ్ సైకిల్ లో చిక్కుకుపోయి ప్రేమను వెనక్కి నెట్టేస్తారు. ఈ క్రమంలో చిన్నచిన్న మనస్పర్థలు.. ఒకరి ఆలోచనలు మరొకరికి నచ్చకపోవడం.. గొడవలు వస్తూ ఉంటాయి. పెళ్లై కొంతకాలం గడిచింది కాబట్టి ఒకరికి మరొకరు ఏంటో తెలుస్తుంది. ఇలా గొడవలు వచ్చినప్పుడు తమ పార్ట్ నర్ ని ఎలా కూల్ చేయాలో కూడా ఆటోమేటిక్ గా తెలుస్తుంది. కానీ కొన్నిసార్లు గొడవ పెద్దదవుతుంది.

ఆ సమయంలో ఇద్దరి మధ్య దూరం పెరిగితే మళ్లీ కలవడం కష్టమవుతుంది. అలా కోపంలో ఉన్నప్పుడు ఎదురుగా వెళ్లి ప్రాబ్లం సాల్వ్ చేద్దామనుకుంటే ఒకరికి ఈగో అడ్డొస్తుంది.. మరొకరి కోపం ఉంటుంది. ఈ క్రమంలో చేయాల్సిన పనేంటంటే.. టెక్స్టింగ్. అదేనండి పెళ్లికి ముందు గంటలు గంటలు చాట్ చేసుకుంటారుగా. ఇలా గొడవలు జరిగినప్పుడు కూల్ గా మీరో మెసేజ్ చేశారనుకోండి అవతలివాళ్లు ఐస్ అయిపోతారు. మీరెలాగు ఎదురుగా ఉండి సారీ చెప్పడం లేదు కాబట్టి మీ ఈగో సేఫ్. మెసేజింగ్ లో వాళ్లు మిమ్మల్ని చూడలేరు కాబట్టి వాళ్ల కోపం తగ్గే ఛాన్స్ కూడా ఉంటుంది. అయితే ఇలాంటి సిట్యుయేషన్ లో ఎలాంటి మెసేజ్ లు చేస్తారో తెలుసా.. ఇంకెందుకు వెయిటింగ్.. భార్యాభర్తలు ఎలాంటి సందేశాలు పంపుకుంటారో ఓసారి లుక్కేయండి..?

 

తప్పెవరిదైనా గొడవ జరిగిందంటే అందులో ఇద్దరి ప్రమేయం ఉంటుంది. అందుకే క్లైమెట్ కూల్ అవ్వాలంటే ముందుగా ఎవరో ఒకరు సరెండర్ అవ్వాల్సిందే. అలాంటి సమయంలో ఈ మెసేజ్ చేస్తే మీ స్వీర్ట్ హార్ట్ పరుగెత్తుకుంటూ వచ్చి మీకో హగ్ ఇవ్వడం ఖాయం. నా మాటలు, చేతలు నిన్నెంతో బాధించాయని నాకు అర్థమవుతుంది. నువ్వు దూరమయ్యాకే నీ విలువ తెలిసొచ్చింది. గడిచిన విలువైన సమయాన్ని తిరిగి తీసుకురాలేను.. కానీ జరిగిన పొరపాటును సరిదిద్దుకోగలనని భావిస్తున్నా. ప్లీజ్‌.. ఒక్క ఛాన్స్‌ ఇవ్వవూ..!!


చేసిన తప్పేంటో మీకు క్లారిటీ ఉన్నప్పుడు ఆ తప్పు మళ్లీ రిపీట్ అవ్వదని చెప్పాలనుకున్నారు అనుకోండి. అప్పుడు ఈ మెసేజ్ పంపేసేయండి. మనకు సంబంధించిన కొన్ని విషయాల్లో నేను నీకు తగిన ప్రాధాన్యమివ్వలేకపోయా. ఈ విషయం ఆలస్యంగానైనా తెలుసుకోగలిగా. ఇకపై ఇలా జరగకుండా జాగ్రత్తపడతా.

మీరు గొడవ పడినప్పుడు ఎదుటి వాళ్లు చెప్పిన మాటలు కరెక్ట్ అనిపించినా.. ఆ సమయంలో ఆ ఆర్గ్యూమెంట్ ని విన్ అవ్వడానికే మనం ట్రై చేస్తాం. కానీ గొడవంతా అయ్యాక రియలైజ్ అవుతాం. అప్పటికే మన ఈగో ఇద్దరి మధ్య చైనా వాల్ అంత పెద్ద గోడ కట్టేస్తుంది. ఆ సమయంలో మీ బెటర్ హాఫ్ ని కూల్ చేయాలంటే ఈ మెసేజ్ సూపర్ మంత్రగా పనిచేస్తుంది. మన ఇద్దరి మధ్య పొరపచ్ఛాలు రావడానికి నువ్వు నా విషయంలో చెప్పే కారణాలన్నీ సరైనవే! నా స్వార్థ బుద్ధితోనే నేను నిన్ను దూరం చేసుకున్నా. నువ్వు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని కోల్పోయేలా చేశా. కానీ, ప్రేమలో స్వార్థం ఉండకూడదని నువ్వు దూరమయ్యాక గానీ తెలుసుకోలేకపోయా. నేను ఇప్పుడు పూర్తిగా మారిపోయా. ఈ ఒక్కసారికీ నన్ను క్షమించు డియర్‌!

ఆ రోజు నిన్ను చాలా బాధపెట్టాను. నువ్వు మంచి మాటలు చెబుతున్నా వినిపించుకునే స్థితిలో అప్పుడు నేను లేను. అలా నా ప్రవర్తనతో నిన్ను నేను హర్ట్‌ చేయాల్సింది కాదు. కానీ నేను చేసిన తప్పుకు ఇప్పుడు క్షమాపణలు కోరుతున్నా.. సారీ!

తప్పు జరిగిన ప్రతీసారి నీవల్లే అన్నట్లు ప్రవర్తించా. అసలు ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందో ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు. నిన్ను బాధపెట్టాలన్నది నా ఉద్దేశం కాదు. కొన్ని సందర్భాల్లో నేనూ తీవ్ర మనోవేదనకు గురయ్యా. ఈ విషయం నీతో చెప్పడానికి ధైర్యం సరిపోలేదు. కానీ, ఇప్పుడు నువ్వు అనుమతిస్తే ప్రతి విషయం నీతో చర్చించడానికి, పొరపాటైతే క్షమాపణ కోరడానికి నేను సిద్ధంగా ఉన్నా.

గతంలో నీ దగ్గర చాలా విషయాలు దాచాను. దానికి కారణం వాటిని నువ్వు అర్థం చేసుకోలేవేమోనన్న భయం! నిజానికి తప్పు నాదే. భార్యాభర్తల మధ్య ఎంత పారదర్శకత ఉంటే అంత మంచిదని ఇప్పుడు తెలుసుకున్నాను. నువ్వు నాకు మరొక్క అవకాశం ఇస్తే ఎలాంటి దాపరికం లేకుండా అన్ని విషయాలు నీతో పంచుకుంటాను.

మన మధ్య గొడవై.. సమస్య పరిష్కారం కోసం నువ్వు నాతో మాట్లాడినప్పుడు.. నేను మరింత ఓపెన్‌గా మాట్లాడాల్సింది. నా విషయాలను నీకు మరింత స్పష్టంగా చెప్పాల్సింది. కానీ నేను అలా చేయలేదు. ఇప్పటికీ సమయం మించిపోయింది లేదు.. ఇద్దరం కలిసి మన అభిప్రాయాలను పంచుకుందాం.. మన మధ్య ఏర్పడిన అగాథాన్ని పూడ్చుకుందాం..!

గతంలో నాలో ఉన్న అభద్రతా భావం వల్ల నిన్ను చాలా ఇబ్బందిపెట్టాను. జరిగిన వాటిని మార్చలేం. కానీ, ఇప్పుడు ఆ ఆలోచనల్ని పక్కన పెట్టి నిన్ను మనస్ఫూర్తిగా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను.. నాలో నీకు నచ్చని విషయాల్ని మార్చుకుంటాననీ మాటిస్తున్నా.

మ్యారేజ్ అంటేనే ఫెవికల్ రిలేషన్ అని అర్థం. అంటే ఒకసారి అతుక్కుంటే అంత ఈజీగా పోదు. పోవాలని ట్రై చేస్తే కొంచెం రిస్క్ తీసుకోకతప్పదు. అందుకే వివాహ బంధంలో గొడవలనేవి కామన్. మన చేతి ఐది వేళ్లే ఒకలా ఉండవు. ఇక మనలా మన పార్ట్ నర్ కూడా ఉండాలంటే ఎలా. అందుకే వాళ్ల మనసేమిటో అర్థం చేసుకోండి. గొడవ ఎవరి వల్ల జరిగినా ముందు మీరే స్టెప్ తీసుకోండి. అలాగని మీ సెల్ఫ్ రెస్పెక్ట్ ని కోల్పోకూడదు. ఏదైనా తెగేదాక లాగకుండా ఉంటేనే అందిరికి మంచిది.

Read more RELATED
Recommended to you

Exit mobile version