“భీమ్లా నాయక్” షో మొత్తం టికెట్లు కొన్న మంత్రి అనిల్ కుమార్ !

-

మంత్రి అనిల్ కుమార్ ఒక షో టికెట్లు మొత్తం కొని తన అనుచరులతో అమ్మించారని తిరుపతి అసెంబ్లీ ఇంచార్జ్ కిరణ్ రాయల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీమ్లానాయక్ చిత్రాన్ని అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక కుట్రలు చేసింది..ఎవరు ఎన్ని కుట్రలు చేసినా సినిమా విజయవంతంగా ముందుకు వెళ్తుందన్నారు. పాపం అదికారులకు అధివారం కూడా సెలవు లేదు..థియేటర్ వద్ద టికెట్ల కోసం చొక్కాలు చించుకుంటు కూర్చున్నారని ఎద్దేవా చేశారు.

ప్రభుత్వం చేస్తున్న కుట్రపై టీడీపీ,కాంగ్రెస్ ఇతర పార్టీలతో పాటు వైసిపి ఇంటర్నల్గా పవన్ కళ్యాణ్ చిత్రానికి మద్దుతూ పలికారు చాలా సంతోషం అన్నారు. మంత్రి వర్గంలో చోటు వస్తుందనే రోజా అనవసర ఆరోపణలు చేస్తున్నారని.. రోజా ఇలా నోరు పారేసుకోవడంవల్లే ఇప్పటివరకు ఉన్నపదవులు పోయాయని చురకలు అంటించారు. రోజా మాట్లాడే ముందు ఆమె కూడా ఒక నటి అని గుర్తు చేసుకోవాలని ఫైర్ అయ్యారు. సినిమా సక్సెస్ అవడంతో పేర్ని నాని మొఖం మాడిపోయిన మసాలా దోసెలా తయారు అయ్యిందని ఎద్దేవా చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version