తిరుపతి ఉపఎన్నిక: బిజేపీకి నో ఛాన్స్‌.. ఇరుకున పెడుతున్న మోడీ వాగ్దానం

-

తిరుపతి ఎంపీ ఉప ఎన్నికల్లో గెలుపుకోసం ప్యూహాలకు పదునుపెట్టాయి ప్రధాన రాజకీయ పార్టీలు. టీడీపీ అయితే ఒక అడుగు ముందేసి తమ అభ్యర్ధిని కూడా ప్రకటించింది. సిట్టింగ్ స్థానం కావడంతో వెంటనే వైసీపీ కూడా తమ అభ్యర్ధి పై క్లారిటీ ఇచ్చేసింది. ఎన్నికల తర్వాత కొత్త పొత్తుకు తెర తీసిన బీజేపీ,జనసేన మాత్రం ఏ పార్టీ పోటి చేయాలన్న అంశం పై లెక్కలు వేస్తున్నాయి. అయితే 214 ఎన్నికలకు ముందు తిరుపతి సాక్షిగా ప్రధాని మోడీ ఇచ్చి వాగ్ధానం ఇప్పుడు బీజేపీని ఇరకాటంలో పడేసేల ఉందట…దీని పై సొంత పార్టీతో పాటు మిగిలిన రాజకీయ పక్షాల్లోనూ ఆసక్తికర చర్చ నడుస్తుంది…


పదేళ్ళ కాదు… పదిహేనేళ్ళు ప్రత్యేక హోదా ఇస్తాం అంటూ తిరుపతి సాక్షిగా అప్పట్లో మోడీ ఇచ్చిన వాగ్దానం..హోదా సెంటిమెంటు ను మెల్లగా తెరపైకి తెస్తున్నాయి మిగిలిన రాజకీయ పక్షాలు. తెలంగాణాలో జరిగిన దుబ్బాక ఉప ఎన్నికల్లో అధికార టిఆర్ఎస్ కు షాక్ ఇచ్చి కమలం జెండాను ఎగరవేశారు అక్కడి నేతలు.. దీంతో అ గెలుపు తెలంగాణా బీజేపీలో కొత్త ఉత్సాహం తీసుకువచ్చింది.. ఇక 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో రెండవసారి అధికారంలోకి వచ్చిన తరువాత ఏపీలో పట్టు కోసం బీజేపీ ప్రయత్నిస్తుంది.

ఏపీలో బీజేపీ బలం నిరూపించుకోవడానికి తిరుపతి పార్లమెంట్‌ ఉప ఎన్నికను ఒక అవకాశంగా మలుచుకొవాలనుకుంటున్నారు పార్టీ నేతలు. ఈ క్రమంలోనే ఉప ఎన్నికలకు ఇంకా కొన్ని నెలల గడువు ఉండగానే బీజేపీ పోటీకి రంగం సిద్ధం చేసుకొంటోంది. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి సునీల్‌ దియోదర్ పార్టీ కేడర్ ,నేతలతో సమావేశం నిర్వహించారు. జీజేపీ,జనసేన పొత్తు తో సంబంధం లేకుండా పార్టీ బరిలో దిగాలంటూ కమలం నేతలు ఓ రేంజ్ లో హడావిడీ చేస్తున్నారు.

అయితే ఇప్పుడు బీజేపీ ఏ నినాదంతో ఉపఎన్నికల్లో ముందుకు వెళ్తుందన్నది పెద్ద ప్రశ్నగా మారింది. 2014 ఎన్నికల ముందు తిరుపతిలో సభలో ప్రధాని మోడీ ఇచ్చిన హోదా అనే మాటను బీజేపీ నేతలు పక్కన పెట్టేశారు. తిరుపతి బిజెపి అగ్రనేతల మీటింగ్ లోను హోదా మాట అనేది వినపడేలేదు..కాదుకాదు వినపడుకుండా జాగ్రత్త పడ్డారు..హోదా ఇస్తామని తిరుపతి వేదికగా చెప్పిన చోట బిజెపి మోసం చేసిందని ఇక ప్రధాన రాజకీయ పార్టీలు అప్పుడే ప్రచారం మొదలెట్టేశాయి. సోషల్ మీడియా వేదికగా దీని పై పెద్ద ఫైటే నడుస్తుంది.

తెలంగాణాలో పరిస్థితులు వేరు అక్కడి అధికార టిఆర్ఎస్ పార్టీకున్న వ్యతిరేక ఓట్లు , కాంగ్రెస్ పార్టీ బలంగా లేకపోవడం లాంటి ఇతర కారణాలవల్ల దుబ్బాక ప్రజలు కొంత సానుకూలంగా ఉండి బిజెపికి విజయాన్ని కట్టబెట్టారు.. అయితే ఏపిలో పరిస్థితులు వేరు.. వీటితో పాటు హోదా సెంటిమెంటు గనుక పార్టీలు ముందుపెడితే బిజెపికి ఇబ్బందులు తప్పవని అంటున్నారు విశ్లేషకులు.. మరి కమల దళంకి తిరుపతి వాసులు షాక్ ఇస్తారా…. లేక రాజకీయ పార్టీల్లానే హోదాను మరిచిపోయి గెలుపు ముంగిట నిలిపిస్తారా అన్నది ఇప్పుడు హాట్ టాపీక్ గా మారింది..

Read more RELATED
Recommended to you

Latest news