2023 వాలెంటైన్స్ డే కి టైటానిక్ రీరిలీజ్..

-

దాదాపు 25 సంవత్సరాల క్రితం వచ్చిన టైటానిక్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే.. అప్పట్లో ఈ సినిమా పెద్ద సంచలనం సృష్టించింది.. దర్శకుడు జేమ్స్ కామరూన్ గురించి ప్రపంచం మొత్తానికి తెలిసేలా చేసింది ఈ చిత్రం.. జాక్ రోజ్ ల ప్రేమ కథ అందర్నీ మరో స్థాయికి తీసుకెళ్లింది.. ఇప్పటికీ ఈ సినిమాపై ఉన్న పలు రికార్డులను ఎవరు బ్రేక్ చేయలేకపోయారు.. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ విషయం వైరల్ గా మారింది ఈ సినిమాను మళ్ళీ రిలీజ్ చేయనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

జేమ్స్ కెమెరూన్ నుంచి వచ్చిన అద్భుతమైన చిత్రం టైటానిక్.. ఈ సినిమా అప్పట్లో భారీ వసూళ్లను సాధించింది.. అలాగే 200 మిలియన్ల డాలర్ల తో తెరకెక్కిన ఈ చిత్రం రెండు బిలియన్ డాలర్ల ను వసూలు చేసింది.. 12 ఏళ్ల పాటు ఇదే రికార్డు కొనసాగగా.. మళ్లీ 2019లో జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన అవతార్ చిత్రమే ఈ రికార్డును బ్రేక్ చేయడం విశేషం.. అప్పట్లో ఈ సినిమా ఆస్కార్ల పంట కూడా పండించింది.. ప్రతి క్యాటగిరి నుంచి ఆస్కార్ ను అందుకుంది. అయితే మళ్లీ ఈ సినిమాను విడుదల చేయడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది..

2023 వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ సినిమాను మళ్ళీ విడుదల చేయడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది తాజాగా అవతార్ 2 ప్రమోషన్స్లో పాల్గొన్న జేమ్స్ కెమెరాన్ను ఈ చిత్రం కోసం అడగగా మళ్లీ ఈ సినిమాను రిలీజ్ చేయడానికి సిద్దంగా ఉన్నట్టు తెలిపారు.. అయితే ఇదే నిజమైతే అప్పట్లో ఈ సినిమాను ఎవరైతే థియేటర్లో చూడటం మిస్ అయ్యారో వారందరూ ఖచ్చితంగా చూసే అవకాశం ఉంటుంది.. అలాగే ఇన్నాళ్ల తర్వాత కూడా ఈ సినిమా మళ్లీ మంచి వసూళ్లనే సాధిస్తుంది అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు..

Read more RELATED
Recommended to you

Latest news