AAP లో TJS విలీనం : ఢిల్లీలో కోదండరాం కీలక చర్చలు !

-

తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన వ్యక్తి ప్రొఫెసర్ కోదండరాం. ఆయన తెలంగాణ ఉద్యమ సమయంలో జేఏసీ అధ్యక్షుడిగా ఉండి… అన్ని పార్టీలను ఏకతాటి పైకి తీసుకు వచ్చారు. అయితే తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కోదండరామ్… పరిస్థితి ప్రస్తుతం చాలా దారుణంగా ఉంది. రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఆయనే స్వయంగా తెలంగాణ జన సమితి పార్టీని ఏర్పాటు చేశారు.

అయితే ఆయన పార్టీ పెడితే… తెలంగాణ ఉద్యమకారులంతా అందులోకి వస్తారని అందరూ ఊహించారు. కానీ దానికి పూర్తి భిన్నంగా జరిగింది. తెలంగాణ జన సమితి పార్టీ లో చెప్పుకోదగ్గ లీడర్లు ఎవరూ లేరు. 2018 ముందస్తు ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ… ఏమాత్రం రాణించలేదు. అయితే అప్పటి నుంచి జన సమితి పార్టీని బిజెపి పార్టీ లో విలీనం చేస్తారని వార్తలు కూడా వచ్చాయి.

అయితే తాజాగా.. ఈ పార్టీని ఆమ్ ఆద్మీ పార్టీలో కలిపి వేస్తారని.. ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఇందులో భాగంగానే ఇవాళ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ ఢిల్లీ వెళ్లారని కూడా ప్రచారం జరుగుతోంది. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తో కోదండరామ్ సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై జన సమితి పార్టీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. రేపు దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news