రవితేజ సంచలన నిర్ణయం..ఇకపై ఆ పాత్రల్లో కూడా నటిస్తా !

-

మాస్ మహారాజా రవితేజ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.క్రాక్ సినిమాతో సాలిడ్ హిట్ కొట్టి తిరిగి ఫాంలోకి వచ్చిన రవితేజ.ఇటీవలే కిలాడి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ మధ్య రవితేజ నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి.ఆ సమయంలోనే గోపీచంద్ మలినేని తెరకెక్కించిన క్రాక్ సినిమాతో హిట్ కొట్టి తిరిగి ఫామ్ లోకి వచ్చాడు.ఈ సినిమా విజయంతో రవితేజ వరుస సినిమాలకు కమిట్ అయ్యాడు.ఇదిలా ఉంటే తాజాగా రవితేజ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇకపై హీరోగానే కాకుండా సపోర్టింగ్ రోల్స్ కూడా చేయాలని నిర్ణయించుకున్నాడట.ఇతర హీరోల సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేయడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని ఇప్పటికే దర్శకులకు కూడా చెప్పేశారట.ఇదిలా ఉంటే రవితేజ ,మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ డైరెక్షన్లో చేస్తున్న సినిమాలో రవితేజ కీలక పాత్రలో కనిపించనున్నాడట.అలాగే బాలకృష్ణ- అనిల్ రావిపూడి దర్శకత్వం లో రాబోతున్న సినిమా లో రవితేజ కీలక పాత్రలో నటిస్తున్నారని టాక్ వినిపిస్తుంది.సపోర్టింగ్ రోల్స్ విషయంలో క్లారిటీ రావాలంటే రవితేజ స్పందించాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news