తెలంగాణలోని చాలా జిల్లాలో 17వ తేదీన జీతాలు పడుతున్నాయని టీఎన్జీవో అధ్యక్షుడు రాజేందర్.. విమర్శలు చేశారు. టీఆరెస్ ప్రభుత్వం ఏర్పాటు తరువాత కొత్త జిల్లాలో ఉద్యోగుల క్యాడర్ స్ట్రేంత్ పెంచాలని సీఎంను కోరుతున్నామని.. ఉద్యోగుల విభజన ఆరాకోరగా మాత్రమే సాగిందన్నారు.
ఏ జిల్లాలో ఉన్న ఉద్యోగిని ఆ జిల్లాలో కొనసాగిస్తాం అని సీఎం హామీ ఇచ్చారని.. అప్పీళ్ల పరిష్కారం, భార్యాభర్తల పరిష్కారం జరగలేదని నిప్పులు చెరిగారు. కొందరి అధికారుల నిర్లక్ష్యం వల్ల ముఖ్యమంత్రిని తప్పుదోవ పట్టిస్తున్నారని.. EHS ఏ జిల్లాలో పనిచేయడం లేదని మండిపడ్డారు. EHS మెరుగైన సేవల కోసం 2శాతం జీతం ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం.. త్వరలోనే EHS అంశంపై కీలక నిర్ణయం తీసుకుంటామన్నారు.
317 జీవో వల్ల ఉద్యోగులకు అన్యాయం జరిగిందని.. 317జీవో తో సంబంధం లేకుండా సాధారణ బదిలీలు చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్ అంశాలన్నీ ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని.. ఉద్యోగుల బదిలీలు పూర్తిగా జగరలేదని పేర్కొన్నారు. ఏపీ లో ఉన్న తెలంగాణ ఉద్యోగులు తెలంగాణ తేవాలని సీఎంను కోరుతున్నామని చెప్పారు. పెండింగ్ పీఆర్సీ నిధులను ప్రభుత్వం విడుదల చేయాలి.. 317జీవో వల్ల ఉద్యోగులు చిన్నా భిన్నం అయ్యారన్నారు.