శ్రీ శుభకృత్ నామసంవత్సరం మార్గశిర శుద్ధ పూర్ణిమ నవంబరు 8 మంగళ వారం భరణి నక్షత్రం మూడో పాదంలో రాహుగ్రస్త చంద్రగ్రహణం వస్తుంది. గ్రహణం అంటే మనం జాగ్రత్తలు తీసుకోవాలి. గ్రహణ సమయం గురించి, గ్రహణం ఎవరు చూడకూడదు వంటి విషయాలను తెలుసుకోవాలి. ఖగోళ, జోతిష్య శాస్త్రాల్లో సూర్య, చంద్ర గ్రహణాలకు ఎంత ప్రాధాన్యత ఉందో మనకు తెలుసు. నవంబరు 8 కార్తీక పౌర్ణమి రోజు చంద్ర గ్రహణం వచ్చింది.
ఇక గ్రహణ సమయం చూస్తే… స్పర్శ కాలం మధ్యాహ్నం 2:38 , మధ్య కాలం మధ్యాహ్నం 4:28, మోక్ష కాలం సాయంత్రం 6:18, ఆద్యంత పుణ్యకాలం 3:40. ఈ గ్రహణాలు జీవితంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. జోతిష్య శాస్త్రం కూడా ఇదే చెబుతోంది. భరణి నక్షత్రం మేష రాశి లో పట్టడం వల్ల అశ్విని, భరణి, కృత్తిక నక్షత్రాల వాళ్ళు ఈ గ్రహణాన్ని చూడరాదు.
చంద్ర గ్రహణం వలన చెడు ఫలితాలు రాకూడదంటే ఇలా చెయ్యండి:
చంద్రగ్రహణం వలన ఎలాంటి చెడు ప్రభావాలు మీ మీద పడకుండా ఉండాలంటే ‘ఓం గ్రాన్ గృన్ సః గురువే నమః’’ అని ఈ మంత్రాన్ని జపించండి. దీనివలన చెడు ఫలితం కలుగదు.
అలానే చంద్ర మూల మంత్రాలను 108 సార్లు జపిస్తే కూడా చాలా మంచిది. అలానే చంద్రగ్రహణ దోషం ఉన్నవారు గ్రహణ సమయంలో హనుమాన్ చాలీసా చదివితే చాలా మంచి కలుగుతుంది.
గ్రహణం తర్వాత వచ్చే శనివారం నాడు మరియు మంగళవారం నాడు సుందరాకాండ పారాయణం చేస్తే చాలా మంచి కలుగుతుంది. దీనివలన గ్రహణ దోషం ఉండదు.
ఇంటిని గ్రహణం అయిపోయిన తర్వాత గంగా జలంతో శుద్ధి చేస్తే చాలా మంచిది.
చంద్రగ్రహణం పూర్తయిన తర్వాత దానధర్మాలను చేస్తే కూడా చాలా మంచి కలుగుతుంది. గ్రహణం పూర్తయిన తర్వాత పేదలకు వస్త్రాలు ఇవ్వడం వంటివి చేయడం వలన దోషాలు పోతాయి.
చాలా మంది గ్రహణ సమయంలో తినడం వండడం వంటి తప్పులు చేస్తూ ఉంటారు అలా కూడా చేయకూడదు.