పెదవులు అందంగా గులాబీ రంగులో ఉండాలంటే… ఇలా చెయ్యండి..!

-

అందమైన పెదవులు ఉండాలని ఎవరికి ఉండదు..? ప్రతి ఒక్కరు కూడా అందంపై శ్రద్ధ పెడతారు అందుకోసం రకరకాల చిట్కాలు ని కూడా ట్రై చేస్తూ ఉంటారు. పెదవులు అందంగా ఉండాలంటే ఈ టిప్స్ బాగా ఉపయోగపడతాయి. ముఖం అందంగా కనపడడానికి పెదాలు కూడా ఒక ముఖ్య పాత్ర పోషిస్తాయి.

మృదువుగా లేతగా పెదవులని ఉంచుకోవాలంటే ఈ చిట్కాలని ట్రై చేయండి. కొంతమంది పెదాలు నల్లగా ఉంటాయి రక్తప్రసరణ సరిగ్గా లేకపోవడం వలన నల్లగా మారచ్చు. అలానే మానసిక ఒత్తిడి స్మోకింగ్ డ్రగ్స్ మొదలైన కారణంగా కూడా పెదవులు నల్లగా మారిపోతాయి. నీళ్లు ఎక్కువ తాగకపోయినా కూడా పెదవులు నల్లగా మారిపోతాయి.

అందమైన పెదాలు కోసం తేనె చక్కెర బాగా ఉపయోగపడతాయి. ఈ రెండిటిని పెదవులపై మర్దన చేస్తే గులాబీ రంగు లోకి పెదవులు మారుతాయి.
నిమ్మరసం బాదం నూనె కలిపి పెదాలకి రాస్తే కూడా పెదవులు అందంగా మారుతాయి. రాత్రి పడుకునే ముందు నిమ్మరసంలో బాదం నూనె రాసి ఉదయాన్నే కడిగేసుకోండి చక్కగా అందంగా పెదాలు మారుతాయి.
దానిమ్మ గింజల రసంలో కొంచెం పాలు వేసి ఈ రెండిటిని గ్రైండ్ చేసి ఈ మిశ్రమంలో కొంచెం పాల క్రీం వేసి పెదాలు మీద రాసి 15 నిమిషాల తర్వాత కడిగేసుకుంటే కూడా పెదాలు అందంగా మారుతాయి.
నిమ్మరసం చక్కెర కూడా బాగా ఉపయోగపడుతుంది. ఈ రెండిటిని పెదాల మీద రాసి మర్దన చేసి కడిగేసుకుంటే కూడా పెదాలు చక్కగా మారుతాయి.
బీట్రూట్ జ్యూస్ లో తేనె కలిపి కూడా పెదాలకి రాసుకోవచ్చు. ఇది కూడా చాలా చక్కగా పనిచేస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news