పరీక్ష టెన్షన్ చాలా మంది విద్యార్థుల్లో ఉంటుంది. పరీక్ష టెన్షన్ లేకుండా హాయిగా పరీక్ష రాయండి అని చెప్పడానికే కానీ నిజానికి ప్రాక్టికల్ గా పరీక్ష టెన్షన్ లేకుండా రాయడం కుదరదు అని చాలామంది భావిస్తారు కానీ చిన్న చిన్న టిప్స్ ని ఫాలో అయితే యాంగ్జైటీ వంటివి ఏమి లేకుండా హాయిగా ప్రశాంతంగా కూర్చుని పరీక్షని రాయచ్చు. పరీక్ష ముందు విద్యార్థులు కచ్చితంగా ఈ టిప్స్ ని పాటించాలి అప్పుడు పరీక్షని ఫ్రీగా రావచ్చు.
చదివేటప్పుడు చిట్కాలని పాటించండి:
చదివేటప్పుడు కాస్త తెలివిగా చదువుకోండి మొదట మీరు ఏఏ పాఠాల నుంచి ఎన్ని ప్రశ్నలు వస్తాయి ఇలాంటి విషయాలు తెలుసుకుని దానికి తగ్గట్టుగా చదువుకోండి. మొత్తం పుస్తకం అంతా చదివితే కూడా అన్ని మార్కులు రావు అని తెలుసుకోండి.
మీ టీచర్ తో మాట్లాడండి:
మీ టీచర్ తో మాట్లాడితే కూడా మీరు రిలాక్స్ గా ఉండగలరు అలానే మంచి మార్కులు స్కోర్ చేయడానికి అవుతుంది. ప్రతి టెస్ట్ లో కూడా ఎలా ప్రశ్నలు వస్తాయి..? ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది తెలుసుకోండి.
తినడం తాగడం మర్చిపోకండి:
తినడం తాగడం చాలా ముఖ్యం. మీ బ్రెయిన్ బాగా పనిచేయాలంటే మీరు బాగా తిని తాగుతూ ఉండాలి. అందులోనూ వేసవికాలం కాబట్టి డిహైడ్రేషన్ మొదలైన సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది కాబట్టి ఆరోగ్యాన్ని కూడా చూసుకోండి.
కొంచెం వ్యాయామం చేయండి:
రెగ్యులర్ వ్యాయామ పద్ధతుల్ని అనుసరిస్తే కూడా టెన్షన్ లేకుండా ఫ్రీగా ఉండొచ్చు.
రిలాక్సేషన్ టెక్నిక్స్ ని ఫాలో అవ్వండి:
హాయిగా ప్రశాంతంగా ఉండేందుకు రిలాక్సేషన్ టెక్నిక్స్ ని పాటించండి అలానే భవిష్యత్తు అంతా కూడా మంచిగా ఉంటుందని అనుకోండి.
కాస్త గ్యాప్ ఇచ్చి చదువుకోండి:
చదువుకునేటప్పుడు మధ్య మధ్యలో విరామాలు తీసుకుంటూ ఉండండి ఇది కూడా మీకు బాగా ఉపయోగపడుతుంది.
బలహీనతని తలుచుకోకండి:
పదేపదే తక్కువ మార్కులు వచ్చిన సబ్జెక్టులని గాని లేదంటే మీ బలహీనతని తలచుకోవద్దు దానివలన మీరే ఇబ్బంది పడాల్సి వస్తుంది. అంతా బాగుంటుందని పాజిటివ్ మైండ్ సెట్ తో ఉండండి పరీక్షను ఎదుర్కోగలను అని మీకు మీరే ధైర్యం చెప్పుకోండి ఇలా ఈ విధంగా మీరు పరీక్షను రాస్తే ఖచ్చితంగా ఏ ఇబ్బంది లేకుండా పరీక్ష రాయచ్చు.