ఎస్బీఐ అకౌంట్ బ్లాక్ కాకుండా ఉండాలంటే.. కేవైసీని ఇలా చేయించాలి..

-

ఎస్బీఐ కొందరి కస్టమర్ల ఖాతాలను బ్లాక్ చేస్తుందనే వార్తలు ఆందోళనకు గురి చేస్తున్నాయి..తమ అకౌంట్ బ్లాక్ అయిందంటూ ఎస్‌బీఐ కస్టమర్లు ట్విట్టర్ ద్వారా ఎస్‌బీఐకి కంప్లైంట్ చేస్తున్నారు. ఎస్‌బీఐ కేవైసీ డ్రైవ్‌లో భాగంగా కేవైసీ అప్‌డేట్ లేని అకౌంట్లను బ్లాక్ చేస్తోంది. బ్యాంకు నియమనిబంధనల ప్రకారం ఖాతాదారులు నిర్ణీత వ్యవధిలో కేవైసీ అప్‌డేట్ చేయించాలి. కేవైసీ వివరాలు అప్‌డేట్ చేయకపోతే ఆ అకౌంట్లను తాత్కాలికంగా నిలిపివేస్తుంది బ్యాంకు. అంటే ఆ అకౌంట్ ద్వారా లావాదేవీలు జరపడం సాధ్యం కాదు. అందుకే ఎస్‌బీఐ కస్టమర్లు తరచూ కేవైసీ అప్‌డేట్ చేస్తూ ఉండాలి..

 

కేవైసీని అప్డేట్ చేయించాలి అంటే మెయిన్ బ్రాంచ్ కు అంటే మనం అకౌంట్‌ ను ఓపెన్ చేసిన దగ్గరకు వెళ్ళాలి.కేవైసీకి సంబంధించిన డాక్యుమెంట్స్, ఫామ్ సబ్మిట్ చేసి కేవైసీ ప్రాసెస్ పూర్తి చేయొచ్చు. అయితే కస్టమర్లు తమ కేవైసీలో ఎలాంటి మార్పులు లేకపోతే ఆన్‌లైన్‌లో కేవైసీ ప్రాసెస్ పూర్తి చేయొచ్చు. ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్‌లో కేవైసీ ఫామ్ డౌన్‌లోడ్ చేసి, పూర్తి చేసి, అవసరమైన డాక్యుమెంట్స్ జత చేసి బ్యాంకు అధికారిక ఇమెయిల్ ఐడీకి పంపాలి. లేదా పోస్టు ద్వారా డాక్యుమెంట్స్ పంపొచ్చు..

కేవైసీని పూర్తి చెయ్యడానికి ఐడెండిటీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆధార్ కార్డ్ లేదా ఆధార్ లెటర్, ఓటర్ ఐడీ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్, NREGA కార్డ్, పాన్ కార్డ్ సబ్మిట్ చేయొచ్చు. వీటిలో ఏ కార్డునైనా ఐడీ ప్రూఫ్ లేదా అడ్రస్ ప్రూఫ్‌గా సబ్మిట్ చేయొచ్చు. ఒకవేళ అకౌంట్ హోల్డర్స్ 10 ఏళ్ల లోపు మైనర్లు అయితే అకౌంట్ ఆపరేట్ చేసేవారి ఐడీ ప్రూఫ్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మైనర్లు స్వయంగా అకౌంట్ ఆపరేట్ చేస్తున్నటైతే ఇతర అకౌంట్ హోల్డర్స్‌కు ఉన్నట్టుగానే కేవైసీ ప్రాసెస్ ఉంటుంది..ఒకవేళ అకౌంట్ హోల్డర్స్ ఫారినర్స్ అయితే,పాస్‌పోర్ట్, ఫారిన్ ఆఫీసెస్, నోటరీ పబ్లిక్, ఇండియన్ ఎంబసీ ధృవీకరించిన రెసిడెన్స్ వీసా కాపీలు కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.

కస్టమర్లు స్మాల్ అకౌంట్స్ ఓపెన్ చేసినవారు బ్యాంకు అధికారుల సమక్షంలో అప్లికేషన్ ఫామ్ పూర్తి చేసి, సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో, సంతకంతో సబ్మిట్ చేస్తే చాలు. ఈ అకౌంట్లలో ఓ ఆర్థిక సంవత్సరంలో రూ.1,00,000 లోపు జమ చేయొచ్చు. ఒక నెలలో విత్‌డ్రాయల్స్, ట్రాన్స్‌ఫర్స్ రూ.10,000 లోపు ఉండాలి. అకౌంట్ బ్యాలెన్స్ రూ.50,000 మించకూడదు..ఇవి అకౌంట్ ఓపెన్ చేసిన 12 నెలల లోపు అవసరమైన పత్రాలను అందించాలి..అంతే అప్పుడు అకౌంట్ కు కేవైసీ అప్‌డేట్ అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news