తక్కువ ధరలో అదిరిపోయే ఫీచర్స్ తో ఇన్ఫినిక్స్ స్మార్ట్ టీవీ లాంచ్..!

ప్రముఖ ఎలెక్ట్రానిక్ వస్తువుల తయారీ ఇన్ఫినిక్స్ ఇప్పుడు మార్కెట్ లోకి మరో టీవీని లాంచ్ చెయ్యనుంది. ఎన్నడూ లేనంత తక్కువ ధరకే 32 ఇంచ్ కొత్త స్మార్ట్ టీవీ లాంచ్ చేస్తానంటోంది. అంతేకాదు, ఈ స్మార్ట్ టీవీని గొప్ప ఫీచర్లతో కూడా అందించనున్నట్లు ప్రకటించింది..Infinix 32 Y1 పేరుతో కొత్త 32 ఇంచ్ HD స్మార్ట్ టీవీని జూలై 12న విడుదల చెయ్యడానికి డేట్ సెట్ చేసిన ఇన్ఫినిక్స్, ఈ స్మార్ట్ టీవీ ధర గురించి ప్రత్యేకంగా చెబుతోంది.

Flipakrt ద్వారా ఈ స్మార్ట్ టీవీని లాంచ్ చేయనున్నది.ఇప్పటికే ఈ టీవీ కోసం ఫ్లిప్ కార్ట్ మైక్రో సైట్ పేజ్ ను కూడా అందించింది..ఈ పేజ్ ద్వారా టీవీకి సంభందించిన పూర్తీ వివరాలను పొందుపరిచారు.గతంలో ఎన్నడూ లేని విధంగా టీవీని అతి తక్కువ ధరకే అందించనున్నారు.ఈ స్మార్ట్ టీవీని ఈ నెల 12 మార్కెట్ లోకి తీసుకురానున్నారు.

బెజెల్ లెస్ డిజైన్ తో పూర్తిగా అంచులు కనబడని విధమైన డిజైన్ తో కనిపిస్తోంది. ఈ స్మార్ట్ టీవీ Youtube తో పాటుగా ప్రముఖ OTT యాప్స్అమెజాన్ ప్రైమ్ వీడియో, Zee5, Sony Liv మరియు మరిన్ని యాప్స్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ ఇన్ఫినిక్స్ అప్ కమింగ్ స్మార్ట్ టీవీ Dolby Audio సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో వస్తుంది మరియు 20W బాక్స్ స్పీకర్లను కూడా కలిగి ఉంటుంది.

త్వరలో మార్కెట్ లోకి రానున్న స్మార్ట్ టీవీ గురించి ఇన్ఫినిక్స్ ప్రస్తుతానికి ఈ వివరాలను మాత్రమే అందించింది.ఇన్ఫినిక్స్ చేస్తున్న టీజింగ్ మరియు ఇచ్చిన క్యాప్షన్ ను పరిశీలిస్తే, Infinix 32 Y1 HD స్మార్ట్ టీవీని ప్రస్తుతం మార్కెట్లో ఉన్న బడ్జెట్ సెగ్మెంట్ 32 ఇంచ్ స్మార్ట్ టీవీలకు గట్టి పోటీ ఇచ్చే లక్ష్యంతో భారత దేశ మార్కెట్ లోకి తీసుకురానున్నారు.ఆన్ లైన్ ఫ్రీ బుకింగ్ కూడా జరుగుతుందని ఫ్లిఫ్ కార్ట్ తాజాగా వెల్లడించింది..