ఉక్రెయిన్ – రష్యా యుద్ధ వాతావరణంతో కొద్ది రోజులుగా ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు భారీ ఎత్తున పెరిగిన సంగతి తెలిసిందే. బంగారం ధరలు బుధవారం నిలకడగా ఉన్నాయి. మరోవైపు పసిడికి భిన్నంగా వెండి ధర భారీగా దిగొచ్చింది. తాజాగా హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,510గా ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,200లుగా ఉంది. మరోవైపు వెండి ధర రూ.600 మేర తగ్గింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో 1 కేజీ వెండి ధర రూ.67,000గా ఉంది.
ధరలలో మార్పులు చోటు చేసుకునేందుకు అనేక కారణాలున్నాయంటున్నారు బులియన్ మార్కెట్ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి తదితర కారణాలు పసిడి రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.