గత కొన్ని రోజులుగా భారీగా తగ్గుతూ వచ్చిన బంగారం ధర ఇప్పుడు పెరుగుదల నమోదు చేస్తుంది. హైదరాబాద్ మార్కెట్ సహా దేశీయంగా బంగారం ధరలు కాస్త పెరుగుతున్నాయి. సోమవారం పెరిగిన బంగారం ధరలు మంగళారం కూడా పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్ లో మంగళవారం బంగారం ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.30 పెరుగడం తో రూ.43,310కు చేరింది.
అదే విధంగా 22 క్యారెట్ల బంగారం ధర కూడా అదే స్థాయిలో పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర రూ.30 పెరుగుదలతో రూ.39,700కు పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.40 పెరగడంతో… రూ.40,550కు చేరింది. అదే విధంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా పెరిగింది. రూ.40 పెరుగుదలతో రూ.41,750కు చేరుకుంది.
ఇక కేజీ వెండి విషయానికి వస్తే రూ.670 తగ్గుదలతో రూ.39,880కు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం ధరలు పెరిగాయి. 1570 డాలర్ల వరకు చేరుకుంది. పసిడి ధర ఔన్స్‌కు 0.46 శాతం పెరుగుదలతో 1574.60 డాలర్ల వద్ద ఉంది. ప్రస్తుతం కరోనా ప్రభావంతో బంగారం ధరలు తగ్గే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.