ఇవాళే సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రయలు

-

సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు ఇవాళ జరుగనున్నాయి. సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలను ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో జరపాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సిఎస్ సోమేశ్ కుమార్ ను ఆదేశించారు. అందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ నేపథ్యంలోనే.. ఇవాళ మధ్యాహ్నం 3 గంటల తర్వాత జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు జరగనున్నాయి.

ప్రస్తుతం ఆయన భౌతికకాయాన్ని ప్రేక్షకుల దర్శనార్థం గచ్చిబౌలి స్టేడియానికి తరలించారు. ఇవాళ ఉదయం అక్కడి నుంచే అంతిమయాత్ర ప్రారంభం కానుంది. ఇక సూపర్ స్టార్ కృష్ణ భౌతిక కాయానికి సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు నివాళి అర్పిస్తున్నారు. సీఎం కేసీఆర్‌, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, జూనియర్ ఎన్టీఆర్, వెంకటేష్, రాఘవేంద్రరావు తదితరులు కృష్ణ పార్థివ దేహానికి నివాళి అర్పించారు.

Read more RELATED
Recommended to you

Latest news