నేడు ఈడీ విచారణకు సోనియాగాంధీ హాజరు.. భారీ స్థాయిలో ఆందోళనకు?

-

కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఈ రోజు ఎన్‌ఫోర్స్‌ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరు కానుందని పార్టీ వర్గాలు వెల్లడించారు. నేషనల్ హెరాల్డ్ కు సంబంధించి మనీలాండరింగ్ కేసులో ఈడీ సోనియాగాంధీకి సమన్లు జారీ చేసింది. విచారణకు హాజరుకావాలని వెల్లడించింది. అయితే సోనియాగాంధీ ఈడీ విచారణకు హాజరుకానున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా భారీగా స్థాయి నిరసనలు చేపట్టాలని పార్టీ వర్గాలు పిలుపునిచ్చాయి.

సోనియా గాంధీ
సోనియా గాంధీ

ఇటీవల కరోనా పాజిటివ్ కారణంగా ఈడీ విచారణకు హాజరు కాలేనన్నట్లు సోనియాగాంధీ గతంలో అప్పీల్ పెట్టుకున్నారు. దీంతో జూన్ 21వ తేదీన ఈడీ మరోసారి సమన్లు జారీ చేసింది. జులై 21వ తేదీన విచారణకు హాజరుకావాలని పేర్కొంది. కాగా, ఇప్పటికే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని కూడా ఈడీ విచారణ జరిపింది. ఐదు రోజులపాటు విచారణ జరగగా.. ఒక్కో సెషల్ 10 నుంచి 12 గంటల సమయం పట్టింది. అప్పుడు కాంగ్రెస్ నేతలు భారీ ఎత్తున ఆందోళనలు చేపట్టారు. పోలీసులు అరెస్ట్ చేయడం.. కొందరు నాయకులపై దాడులు కూడా జరిగాయి.

Read more RELATED
Recommended to you

Latest news