ఈ సంపాదన కి అలవాటు పడితే సమాజంలో గౌరవం ఉండదు తెలుసా..?

-

ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు ఉంటాయి. అయితే ఆచార్య చాణక్య జీవితం గురించి చాలా ముఖ్యమైన విషయాలను తెలిపారు. జీవితంలో ఎదురయ్యే సమస్యల్ని ఎలా అధిగమించవచ్చు అనే దాని గురించి తెలిపారు. అదే విధంగా ఏ విధంగా అనుసరిస్తే జీవితం బాగుంటుంది..?, ఎలాంటి సమస్యలు లేకుండా హాయిగా ఉండొచ్చు..? అనే విషయాలను తెలిపారు.

అయితే జీవితంలో ఇలాంటి సంపాదన కి అలవాటు పడకూడదని చాణక్య చెప్తున్నారు. ఒకవేళ కనుక ఇటువంటి సంపాదనకు అలవాటు పడితే సమాజంలో గౌరవం కోల్పోతామని చెప్పారు. అయితే మరి ఎలాంటి సంపాదన కి అలవాటు పడకూడదు అనే దాని గురించి చూద్దాం.

చాణక్య ధర్మాన్ని విస్మరించి డబ్బు సంపాదించాలనే తపన విడిచి పెట్టాలని చెప్పారు. ఎందుకంటే మోసం ద్వారా లేదా అక్రమంగా సంపాదించి వచ్చిన డబ్బు కష్ట సమయంలో ఉపయోగ పడతాయని చాణక్య చెప్పారు. అలాంటి సంపాదన వల్ల గౌరవం దెబ్బతింటుంది. అందుకని అలా సంపాదించకూడదు.

అదే విధంగా శత్రువుని మెప్పించడం ద్వారా సంపాదించిన డబ్బు పనికిరానిదిగా భావించారు. అలాంటి డబ్బు సంపాదించడం వల్ల ఎప్పుడూ అవమానానికి గురవుతారు. అలా వచ్చిన డబ్బులు మంచివి కావు. అదే విధంగా ఒక వ్యక్తిని హింసను అనుభవిస్తూ డబ్బును సంపాదించడం మంచిది కాదని చాణక్య తెలిపారు. ఎందుకంటే అటువంటి డబ్బు సంపాదించడానికి శారీరక, మానసిక బాధలను అనుభవించాలి. కనుక ఇలాంటి డబ్బుని అస్సలు సంపాదించండి.

Read more RELATED
Recommended to you

Latest news