రేపు ఖైరతాబాద్‌ మహాగణపతికి తొలిపూజ

రేపు వినాయక చవిత పర్వ దినం అన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యం లోనే రేపు ఖైరతాబాద్‌ మహా గణపతి కి అట్టహాసం గా పూజ చేయనున్నారు. రేపు ఉదయం 11.30 గంటలకు ఖైరతాబాద్ మహా గణపతికి తొలి పూజ చేయనున్నారు. ఇక ఈ తొలి పూజ లో తెలంగాణ గవర్నర్ తమిళ సై, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ పాల్గొననున్నారు.

ఈ సారి 40 అడుగుల ఎత్తు లో శ్రీ పంచముఖ రుద్ర మహా గణపతిగా దర్శనం ఇస్తున్నారు ఖైరతాబాద్ మహాగణపతి.. అలాగే ఖైరతాబాద్ మహాగణపతి కి ఇరు వైపులా క్రిష్ణ కాళి, కాల నాగేశ్వరిలు ఈ సారి దర్శనం ఇస్తున్నారు. ఇక అటు… భక్తులు స్వామి వారిని దర్శించు కునేందుకు… అన్ని ఏర్పాట్లు చేశారు ఖైరతాబాద్ మహా గణపతి కమిటీ సభ్యులు. ఖైరతాబాద్ మహాగణపతి సన్నధిలో కరోనా నియమ నిబంధనలు పటిష్టంగా అమలు అవుతున్నాయి. మాస్క్‌ లు ఉన్న వారినే స్వామి వారి దర్శనానికి అనుమతులు ఇస్తున్నారు.