ఏపీలో టికెట్ల రేట్ల వివాదం కొనసాగుతూనే ఉంది. అటూ ఇటు తిరిగి ఈ వివాదం పొలిటికల్ టర్న్ తీసుకుంది. తాజాగా టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ టాలీవుడ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ సర్కార్ తనికీల పేరుతో థియేటర్లు మూసి వేస్తున్నారని.. వేల మంది ఉపాధి కొల్పోతున్నారని.. అయినా సినిమా పెద్దలు నోరు మెదపడం లేదని విమర్శించారు. సినిమాల్లో చూపించే హీరోయిజం జగన్ సర్కార్ పై ఎందుకు చూపించడం లేదని ప్రశ్నించారు. రీల్ హీరోలుగా మిగిలిపోతున్నారు తప్పితే రియల్ హీరోలుగా మారరా..? అని సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రంలో సమస్యలపై ఎందుకు స్పందించడం లేదు.. మీకు రాష్ట్ర సమస్యలు పట్టవా అని అనగాని సత్య ప్రసాద్ అన్నారు. కావేరి జలవివాదంపై తమిళ సిని ఇండస్ట్రీ ఏకం అయింది. కానీ రాష్ట్రంలో సమస్యలపై మీరెందుకు మాట్లాడటం లేదని టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్దలను గురించి అన్నారు.
ఇదిలా ఉంటే ఏపీలో టికెట్ల వివాదం కొనసాగుతూనే ఉంది. నాని వ్యాఖ్యలతో మొదలైన దుమారం ఇంకా చల్లారడం లేదు. నాని వ్యాఖ్యలకు ప్రతిగా మంత్రులు పేర్నినాని, ఎమ్యెల్యే రోజాలు స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చారు. టికెట్ ధరలపై ఏర్పాటు చేసిన కమిటీ నేడు సమావేశం కాబోతోంది.