సీఎం కేసీఆర్ కు ఉద్యోగుల ఉసురు కచ్చితంగా తగులుతుందని.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. సీఎం బిజీ గా ఉన్నారు, ఉద్యోగుల సమస్యలు పట్టించుకునే పరిస్థితిలో లేరు.. అందుకే గవర్నర్ ని కలిసామని.. రాష్ట్ర పతి ఉత్తర్వులు వచ్చినప్పుడే ఉద్యోగ కేటాయింపు లు చేస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. 41 నెలలు ఏమి చేయకుండా ఇప్పుడు అదర్బాదరగా కేటాయింపు లు చేస్తున్నారని.. సీనియర్లకు జూనియర్లకు పంచాయతీ పెట్టిస్తున్నారని.. స్థానికత కోసమే తెలంగాణ ఉద్యమం నడిచింది… ఇప్పుడు ఆ స్థానికతను తుంగలో తొక్కారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఒక జిల్లా ఉద్యోగి మరో జిల్లాకు కేటాయిస్తున్నారని.. ఉద్యోగుల పాపం ఊరికే పోదని కేసీఆర్ పై మండిపడ్డారు. 317 జీఓ ని సవరించాలి..ఈ జీఓ లో తమకు అనుకూల మైన వారిని ఇష్టమొచ్చిన చోట కెటయించుకునే ఆప్షన్ ఉందన్నారు. సీఎం వెంటనే స్పందించాలని.. ఇంకా ఎంత మంది ఉసురు పోసుకుంటే సీఎం కి కనికరం కలుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులు ఆవేదన చెందకండి… అనారోగ్యం కి గురికాకండని కోరారు. సకల జనుల సమ్మె మరో సారి చేయాల్సి వస్తుంది…ఉద్యోగ ఉపాధ్యాయులకు అండగా బీజేపీ ఉంటుందని చెప్పారు.
టిజిఓ, టీఎన్జీవో లు ఇప్పటికైనా మనసు మార్చుకోవాలన్నారు.