టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ ఎదుట డైరెక్టర్ పూరి జగన్నాథ్ హాజరయ్యారు. కాసేపటి క్రితమే డైరెక్టర్ పూరి జగన్నాథ్.. ఈడీ ఎదుట హాజరయ్యారు. పూరి జగన్నాథ్ తో పాటు ఆయన తనయుడు ఆకాష్ పూరి, పూరి చార్టెడ్ అకౌంటెంట్ కూడా హాజరు అయ్యారు. ఎక్సైజ్ శాఖ కేసులో నిందితులైన కెల్విన్ పీటర్ కమింగ్ ఇచ్చిన స్టేట్ మెంట్ పై టాలీవుడ్ స్టార్లకు నోటీసులు జారీ చేసింది ఈడీ. పది రోజుల క్రితం పూరి జగన్నాథ్ తో పాటు 11 మంది సినీ ప్రముఖులకు నోటీసులు జారీ చేశారు ఈ డి అధికారులు.
నేటి నుంచి 22వ తేదీ వరకు సినీ ప్రముఖులను విచారన చేయబోతున్నారు ఈ డి అధికారులు. నిందితుల దగ్గరి నుంచి డ్రగ్స్ తీసుకున్న తర్వాత డబ్బుల చెల్లింపుల పై ఈడి ఆరా తీయనుంది. 2017 లో ఎక్సైజ్ శాఖ బుక్ చేసిన కేసు లో పూరీ నీ విచారించిన అధికారులు… తాజాగా టాలీవుడ్ డ్రగ్స్ కేసులో విచారించనున్నారు. ఇక డైరెక్టర్ పూరి జగన్నాథ్ అనంతరం నటి ఛార్మి సెప్టెంబర్ 2 వ తేదీన హాజరు కానున్నారు.