రాహుల్ గాంధీ నివాసంలో పోలీసు ఉన్నతాధికారులు

-

కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ నివాసానికి చేరుకున్నారు ఢిల్లీ పోలీసులు. ఢిల్లీలోని రాహుల్ ఇంటికి ఆదివారం వెళ్లారు పోలీసు ఉన్నతాధికారులు. మహిళలు లైంగిక వేధింపులకు గురవుతున్నారని రాహుల్ గాంధీ ” భారత్ జోడో” యాత్రలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే. అయితే బాధిత మహిళల సమాచారం తెలుసుకునేందుకు పోలీసులు రాహుల్ గాంధీ ఇంటికి వచ్చారు.

బాధితుల సమాచారం ఇవ్వాలని రాహుల్ గాంధీకి ఇప్పటికే పోలీసులు నోటీసులు ఇచ్చిన విషయం కూడా తెలిసిందే. అయితే బాధిత మహిళల వివరాలు చెప్పాలని పోలీసులు కోరుతున్నారు. లైంగిక వేధింపులకు సంబంధించి రాహుల్ గాంధీని సంప్రదించిన మహిళల వివరాలను కోరుతూ మార్చి 16న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి నోటీసులు జారీ చేశారు పోలీసులు. అయితే బాధితుల సమాచారం కోసం నేడు రాహుల్ నివాసానికి చేరుకున్నారు.

ఈ సందర్భంగా ఢిల్లీ స్పెషల్ సిపి సాగర్ ప్రీత్ హుడా మాట్లాడుతూ.. ” రాహుల్ గాంధీని కలిసి మహిళా బాధితుల సమాచారం అడిగాం. ఇప్పటికే రాహుల్ గాంధీ కి నోటీసులు ఇచ్చాం. రాహుల్ తనకు కొంత సమయం కావాలని, పోలీసులు అడిగిన సమాచారం ఇస్తానని చెప్పారు. వేధింపులకు గురైన మహిళల వివరాలు తెలిస్తే వాళ్లకు న్యాయం చేయగలం” అన్నారు ఢిల్లీ స్పెషల్ సిపి సాగర్ ప్రీత్.

Read more RELATED
Recommended to you

Latest news