టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి అరెస్ట్

-

కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు. నిన్న రాత్రి ఆయన నివాసంలో అరెస్ట్ చేసిన పోలీసులు… టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డని నిజామాబాద్‌కు తరలించారు. రెండు రోజుల క్రితం పేలుడు పదార్థాల కేసులో ముగ్గురిని అరెస్ట్ చేశారు పోలీసులు.

tpcc general secretary gaddam chandrasekhar reddy arrested
tpcc general secretary gaddam chandrasekhar reddy arrested

పేలుడు పదార్థాలు చంద్రశేఖర్ వద్ద నుంచి తెచ్చినట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. ఇదే కేసులో గడ్డం చంద్రశేఖర్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు. ఇక అటు చంద్రశేఖర్ రెడ్డి అన్న సూర్య పరారీలో ఉన్నాడు.. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇక ఈ సంఘటన పై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news