రాహుల్ ను ఒక కోరిక కోరిన రేవంత్ రెడ్డి

-

వరుస ఓటములతో సతమతమవుతున్న కాంగ్రెస్ పార్టీ అధిష్టానం.. పార్టీని ప్రక్షాళన చేసే అడుగులు వేస్తోంది.. ఈ నేపథ్యంలోనే నిన్న నవ్ సంకల్ప్ శిబిర్ నిర్వహించి కాంగ్రెస్ ముఖ్య నేతల నుంచి సలహాలు సూచనలు స్వీకరించారు. ఈ క్రమంలోనే ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ ప్రతి రాష్ట్రంలో అక్టోబ‌ర్ 2 నుంచి 90 కిలోమీటర్లు పాదయాత్ర చేయనున్నట్లు ప్రకటించారు. అయితే.. ఈ సందర్బంగా.. రాహుల్ గాంధీని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఓ కోరిక కోరారు. రాహుల్ గాంధీ నేతృత్వంలో ప్రారంభం కానున్న పాద‌యాత్ర‌ను తెలంగాణ నుంచి ప్రారంభించాల‌ని పార్టీ అధిష్ఠానాన్ని కోర‌నున్న‌ట్లు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వెల్లడించారు.

సోమ‌వారం గాంధీ భ‌వ‌న్‌లో జ‌రిగిన పార్టీ విస్తృత స్థాయి కార్య‌క‌ర్త‌ల స‌మావేశంలో మాట్లాడిన ఆయ‌న.. సెంటిమెంట్‌గా యాత్ర‌ను తెలంగాణ‌లో ప్రారంభిస్తే బాగుంటుంద‌న్న విష‌యాన్ని పార్టీ పెద్ద‌ల‌కు చెబుతామ‌ని తెలిపారు. రైతు సంఘర్ష‌ణ స‌భ పేరిట వ‌రంగ‌లో నిర్వ‌హించిన రాహుల్ స‌భ విజ‌య‌వంత‌మైంద‌న్న రేవంత్ రెడ్డి… ఆ స‌భ‌లో ప్ర‌క‌టించిన వ‌రంగ‌ల్ డిక్ల‌రేష‌న్‌కు పార్టీ పెద్ద‌ల నుంచి మంచి రెస్పాన్స్ వ‌చ్చింద‌న్నారు. డిజిట‌ల్ మెంబ‌ర్ షిప్ డ్రైవ్ కూడా తెలంగాణ‌లో అంచ‌నాల‌కు మించి విజ‌యవంతం చేశామ‌ని అన్నారు రేవంత్.

Read more RELATED
Recommended to you

Exit mobile version