నేడు చంచల్ గూడ జైలుకు రేవంత్ రెడ్డి..

-

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నేడు చంచల్ గూడ జైలుకు వెళ్లనున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పై దాడి కేసులో అరెస్టయిన యువకులతో ములాఖత్ అయ్యేందుకు ఆయన జైలుకు వెళ్తున్నారు. ఈ సందర్భంగా వారి సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు. మరోవైపు అరెస్టయిన యువకుల కోసం న్యాయవాదులను నియమించినట్టు కాంగ్రెస్ నేతలు తెలిపారు. అగ్నిపథ్ కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 27న కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలను చేపట్టబోతున్నట్టు చెప్పారు. ఈ నిరసన కార్యక్రమానికి కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి రావాలని కోరారు.

Telangana: After Congress's Loss in Huzurabad, Questions Over Revanth  Reddy's Leadership

అగ్నిప‌థ్ కు వ్య‌తిరేకంగా కొంద‌రు అభ్య‌ర్థులు సికింద్రాబాద్ రైల్వేస్టేష‌న్‌పై దాడిచేసిన సంగ‌తి తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌లో ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు బోగీ ఒక‌టి ద‌గ్ధ‌మైంది. అలాగే అద్దాలు ప‌గిలిపోవ‌డం, ఇత‌ర‌త్రా విధ్వ‌సం జ‌రిగింది. దీనికి కార‌కులైన‌వారంద‌రినీ గుర్తించి అరెస్ట్‌చేసి చంచ‌ల్‌గూడ జైలుకు త‌ర‌లించారు. త‌మ పిల్ల‌ల‌కు హైద‌రాబాద్ రావాల‌ని ఫోన్ వ‌స్తే వ‌చ్చార‌ని, వారికి, ఈ విధ్వంసానికి ఎటువంటి సంబంధం లేద‌ని జైలులో ఉన్న అభ్య‌ర్థుల త‌ల్లిదండ్రులు చెబుతున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news