తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి నిత్యం వేలాది మంది వస్తుంటారు. కేవలం రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల భక్తులు కూడా తరలివస్తారు.అయితే, శ్రీవారి దర్శనార్థం కాలినడకన తిరుమలకు వస్తున్న ఓ భక్తుడు అనుకోకుండా గుండెపోటుకు గురై మరణించాడు. మృతుడిని తెలంగాణ వాసిగా గుర్తించారు.
రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌కు చెందిన వెంకటేశ్(50) కుటుంబ సభ్యులు, సన్నిహితులతో కలిసి శ్రీవారి మెట్టు మార్గంలో నిన్న ఉదయం తిరుమలకు బయలుదేరాడు. 400వ మెట్టు వద్ద ఒక్కసారిగా చాతి నొప్పితో కుప్పకూలిపోయాడు. వెంటనే భక్తుడిని చంద్రగిరి ఏరియా ఆస్పత్రికి తరలించగా, అప్పటికే వెంకటేష్ మృతి చెందినట్టు వైద్యులు వెల్లడించారు.