ట్రావెల్: స్పితి వ్యాలీని చూస్తే వావ్ అనాల్సిందే..!

-

కొత్త కొత్త ప్రదేశాలు చూడటం అంటే చాలా మందికి ఇష్టం. పైగా మనం కొత్త ప్రదేశాలకు వెళ్లి ఎన్నో తెలియని విషయాలు తెలుసుకోవచ్చు. అలానే ట్రావెలింగ్ చేయడం వల్ల మనం ఎంతో ప్రశాంతంగా ఆనందంగా ఉండొచ్చు. వర్క్ నుండి రిలీఫ్ కూడా మనకి వస్తుంది. అయితే మీకు కూడా ట్రావెలింగ్ అంటే ఇష్టమా..? ఏదైనా మంచి ప్రదేశానికి వెళ్లాలనుకుంటున్నారా అయితే తప్పకుండా ఈ ప్రదేశాలను చూడాల్సిందే. మరిక పూర్తి వివరాలు లోకి వెళ్లి పోదాం.

హిమాచల్ ప్రదేశ్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. హిమాచల్ ప్రదేశ్ గురించి అందరూ వినే ఉంటారు. కానీ హిమాచల్ ప్రదేశ్ అంటే మనకి షిమ్లా, కులు మనాలి మాత్రమే గుర్తొస్తాయి. కానీ మనకి తెలియని ప్రదేశాలు కూడా ఉంటాయి, స్పితీ ఆనేది అద్భుతమైన వ్యాలీ. ఇది కూడా హిమాచల్ లో ఉంది.

చంద్రతాల్ లేక్:

ఇది లహాల్ ప్రాంతంలో వుంది. చక్కగా చుట్టూ హిమాలయాలు ఉంటాయి. చూడటానికి ఎంతో సౌందర్యంగా ఉంటుంది. కాంపింగ్ చేసుకుంటే కూడ ఇది బెస్ట్ ప్లేస్.

ధన్‌కార్ మోనాస్టెరీ:

ఇది కూడ చూడాల్సిన ప్రదేశమే. సముద్ర మట్టానికి 12,774 ఫీట్ల హైట్ లో ఉందిది. అందంగా వుంటుంది ఇది కూడ. బుద్ధడి విగ్రహంతో కలిసి ఓ మ్యూజియం వుంది.

కీలాంగ్ మార్కెట్:

కళా వస్తువులు లేదా హస్తకళలను ఇక్కడ కొనచ్చు. మీకు కూడ ఇలాంటివి ఇష్టమైతే చక్కగా షాపింగ్ చేసుకోవచ్చు. ఈ ప్రదేశానికి ఎలా వెళ్ళాలి ఆనేది చూస్తే.. రిమోట్ ఏరియా కనుక రైలు, విమాన సర్వీసులు లేవు. మీరు షిమ్లా, కులు, మనాలీ వెళ్తే అక్కడి నుండి రోడ్డు మార్గం లో వెళ్లాల్సి ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news