కేంద్ర ప్రభుత్వం వరుసగా రెండు రోజుల పాటు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మండిపడ్డారు. పెరిగిన గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను నిరసిస్తూ.. నేడు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని టీఆర్ఎస్ శ్రేణులకు పిలుపు నిచ్చారు. రాష్ట్రంలో అన్ని నియోజక వర్గ కేంద్రాల్లో ఆందోళనా కార్యక్రమాలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ సూచించారు. అలాగే కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు నిరసనగా కూడా ఆందోళన కార్యక్రామలు చేయాలని పిలుపు నిచ్చారు.
కేంద్ర ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టు గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతుందని సీఎం కేసీఆర్ మండి పడ్డారు. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. పెరిగిన ధరలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలను ఉద్ధృతం చేయాలని పిలుపు నిచ్చారు. కాగ ఈ సమాచారాన్ని ఇప్పటికే అన్ని నియోజక వర్గాల ఎమ్మెల్యేలకు, ఇన్ ఛార్జీల తో పాటు జిల్లా అధ్యక్షులకు ఇచ్చారు. నేటి నుంచి పోరాటానికి సిద్ధం కావాలని వీరికి సీఎం కేసీఆర్ సూచించారు.