నెల నెల చిన్న మొత్తంలో సేవ్‌ చేయాలనుకుంటున్నారా.. ఈ బ్యాంకుల్లో అయితే బెస్ట్‌

-

ఒకటే అకౌంట్‌ ఉండటం వల్ల డబ్బులు సేవింగ్‌ చేసుకోవడం కష్టం మనిపిస్తుంది. అకౌంట్‌లో ఉన్న డబ్బు అంతా నెలాఖరు వచ్చేసరికి ఖర్చు అయిపోతుంది. ఓన్లీ సేవింగ్స్‌ మాత్రమే ఒక అకౌంట్‌ ఉంటే అందులో నెలకు ఇంత అని వేసుకుందా అని అనుకునేవాళ్లు చాలా మంది ఉంటారు. అలా మీరు కూడా అనుకుంటుంటే.. ఈ ఆర్టికల్‌ మీ కోసం..! ప్రతి నెలా చిన్న మొత్తంలో పొదుపు చేయాలనుకుంటే రికరింగ్ డిపాజిట్లపై ఓ లుక్కేయండి.

రికరింగ్ డిపాజిట్లపై (RD) ప్రస్తుతం బ్యాంకులు ఆకర్షణీయ వడ్డీ రేటును (Interest Rates) అందిస్తున్నాయి. వీటిల్లో డబ్బులు ఇన్వెస్ట్ చేయడం వల్ల మంచి రాబడి పొందొచ్చు. రిస్క్ లేకుండా స్థిరమైన రాబడి పొందాలని భావించే వారికి రికరింగ్ డిపాజిట్లు మంచి ఛాయిస్‌..మ్యూచువల్ ఫండ్స్‌లో సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) రూపంలో డబ్బులు ఇన్వెస్ట్ చేయలేని వారు ఈ ఆప్షన్ ఎంచుకుంటే సరిపోతుంది.

చాలా బ్యాంకులు రికరింగ్ డిపాజిట్ సర్వీసులు అందిస్తున్నాయి. ఇందులో 6 నెలల నుంచి పదేళ్ల వరకు డబ్బులు ఇన్వెస్ట్ చేయొచ్చు. మీరు డబ్బులు ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించిన దగ్గరి నుంచి మెచ్యూరిటీ వరకు వడ్డీ రేటులో మార్పు ఉండదు. ప్రారంభంలో ఏ వడ్డీ రేటు ఉందో అదే వడ్డీ రేటు చివరి వరకు ఉంటుంది.. మీరు ఎంచుకునే టెన్యూర్ ప్రాతిపదికన వడ్డీ రేటు మారే అవకాశం ఉంది.

రికరింగ్ డిపాజిట్లపై ఆకర్షణీయ వడ్డీ అందించే బ్యాంకులు ఏమంటే..

బంధన బ్యాంక్ పలు రకాల టెన్యూర్లలో ఆర్‌డీ సర్వీసుల అందిస్తోంది. వడ్డీ రేటు 4.5 శాతం నుంచి 5.6 శాతం వరకు ఉంది.
సీనియర్ సిటిజన్స్‌కు 0.75 శాతం అధిక వడ్డీ వస్తుంది.
యస్ బ్యాంక్ 6.75 శాతం దాకా వడ్డీని అందిస్తూ వస్తోంది. పదేళ్ల వరకు ఆర్‌డీ చేయొచ్చు.
సీనియర్ సిటిజన్స్‌కు 75బేసిస్ పాయింట్ల వరకు ఎక్కువ వడ్డీ వస్తుంది.

కాబట్టి..రిస్క్‌ లేకుండా సేవ్ చేసుకుందాం అనుకునే వాళ్లు ఈ రికరింగ్‌ డిపాజిట్లపై ఓ లుక్కేయండి.!

Read more RELATED
Recommended to you

Latest news