మునుగోడు ఉపఎన్నికలో గుర్తులపై హైకోర్టులో టీఆర్ఎస్ లంచ్ మోషన్ పిటిషన్ 

-

మునుగోడు ఉపఎన్నికలో గుర్తులపై హైకోర్టులో టీఆర్ఎస్ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. కారును పోలిన ఎనిమిది గుర్తులను తొలగించాలని కోర్టును కోరింది. కెమెరా, చపాతీ రోలర్, డోలీ, రోడ్ రోలర్, సబ్బు డబ్బా, టీవీ, కుట్టు మిషన్, ఓడ గుర్తు కేటాయించవద్దని విజ్ఞప్తి చేసింది.

భోజన విరామంలో అత్యవసర విచారణ జరపాలని విజ్ఞప్తి చేయగా ధర్మాసనం నిరాకరించింది. నవంబరు 3న పోలింగ్ ఉన్నా ఈసీ నిర్ణయం తీసుకోవడం లేదని టీఆర్ఎస్ హైకోర్టుకు తెలిపింది. దీనిని మధ్యాహ్నం పరిశీలించలేమని.. రేపు విచారణ జరుపుతామని సీజే ధర్మాసనం పేర్కొంది.

గతంలో 2018 ఎన్నికల్లో కారును పోలిన గుర్తుల వల్ల తమ అభ్యర్థులకు నష్టం జరిగిందని టీఆర్ఎస్ చెబుతోంది. పలు నియోజకవర్గాల్లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల అభ్యర్థుల కన్నా.. ఈ గుర్తులతో బరిలో ఉన్న స్వతంత్ర అభ్యర్థులకే ఎక్కువ ఓట్లు వచ్చాయని టీఆర్ఎస్ పార్టీ కోర్టుకు విన్నవించింది. కారును పోలి ఉన్నందునే వాటికి ఓట్లు పడ్డట్లు స్పష్టమవుతోందని ఈసీకి వివరించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version