టీఆర్ఎస్ ప్లీనరీలో 11 తీర్మాణాలు… ప్రవేశపెట్టనున్న నాయకులు

-

టీఆర్ఎస్ పార్టీ 21వ ప్లీనరీకి గులాబీ శ్రేణులు సిద్ధం అయ్యాయి. హైదరాబాద్ నగరంలోని మాదాపూర్ హెచ్ఐసీసీ వేదిక గులాబీ మయంగా మారింది. నగరంలో ఎక్కడ చూసిన కేసీఆర్, కేటీఆర్ కటౌట్లను ఏర్పాటు చేశారు టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు. ప్లీనరీ వేదిక వద్ద పోలీసులు అత్యంత కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. మొత్తం 2500 మంది పోలీస్ సిబ్బందితో భద్రతను ఏర్పాటు చేశారు. 

ఇదిలా ఉంటే ప్లీనరీ వేదికగా కేసీఆర్ ఎలాంటి సంచలన నిర్ణయాలు తీసుకుంటారో అని తెలంగాణ సమాజం మొత్తం ఎదురుచూస్తోంది. ఉదయం 11 గంటలకు కేసీఆర్ ప్రసంగం ఉండబోతోంది. దీంతో పాటు మొత్తం 11 అంశాలపై టీఆర్ఎస్ పార్టీ నాయకులు తీర్మాణాలు చేయనున్నారు. ఇందులో భాగంగా జాతీయ రాజకీయాలపై మంత్రి కేటీఆర్ తీర్మాణం చేయనున్నారు. వరి కొనుగోలుపై తీర్మాణాలు ప్రవేశపెట్టనున్నారు మంత్రి నిరంజన్ రెడ్డి. ధరల పెరుగుదలపై తీర్మాణం ప్రవేశపెట్టనున్నారు పల్లా రాజేశ్వర్ రెడ్డి. కేంద్ర పన్నుల వాటాపై హరీష్ రావు తీర్మాణాన్ని ప్రవేశపెట్టనున్నారు. క్రిష్ణా జలాల వివాదంపై కడియం శ్రీహరి, కేంద్రం వైఖరిపై తీర్మాణం చేయాలని నామా నాగేశ్వర్ రావు, దళితబంధు దేశంలో అమలుచేయాలని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తీర్మాణాలు ప్రవేశపెట్టనున్నారు.

మొత్తం 11 తీర్మాణాలు:

  1. యాసంగిలో వరి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయక పోయినా రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నందుకు అభినందన తీర్మానం
  2. దేశం విస్తృత ప్రయోజనాల రీత్యా జాతీయ రాజకీయాల్లో తెరాస పార్టీ కీలక భూమిక పోషించాలని రాజకీయ తీర్మానం
  3. ఆకాశాన్నంటిన ధరలు పెంచుతూ పేద మధ్యతరగతి ప్రజల మీద మోయలేని భారం వేస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ధరల నియంత్రణను డిమాండ్ చేస్తూ తీర్మానం
  4. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్​లో ఆమోదింప చేసి అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తీర్మానం
  5. భారతదేశ సామరస్య సంస్కృతిని కాపాడుకోవాలని మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడాలని తీర్మానం
  6. బీసీ వర్గాలకు కేంద్ర ప్రభుత్వంలో బీసీ సంక్షేమ మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని బీసీ వర్గాల జనగణన జరపాలని డిమాండ్ చేస్తూ తీర్మానం
  7. తెలంగాణ రాష్ట్ర సామాజిక పరిస్థితులకు అనుగుణంగా రిజర్వేషన్ శాతం పెంచాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ తీర్మానం
  8. రాష్ట్రాల ఆదాయానికి గండి కొడుతూ కేంద్రం పన్నుల రూపంలో కాకుండా సెస్​ల రూపేణా వసూలు చేయడం మానుకోవాలని డివిజబుల్ పూల్​లోనే పన్నులు వసూలు చేయాలని తీర్మానం
  9. నదీ జలాల వివాద చట్టం సెక్షన్-3 ప్రకారం కృష్ణా జలాల్లో వాటాపై ట్రిబ్యునల్‌కు రిఫర్ చేయాలని డిమాండ్‌ చేస్తూ తీర్మానం
  10. భారత రాజ్యాంగం ప్రతిపాదించిన సమాఖ్య విలువలను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వ అప్రజాస్వామిక వైఖరికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిస్తూ తీర్మానం
  11. తెలంగాణ రాష్ట్రంలో నవోదయ విద్యాలయాలను వైద్య కళాశాలలను వెంటనే ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ తీర్మానం

 

Read more RELATED
Recommended to you

Latest news