మెహందీ పోవాలంటే ఈ చిట్కాలను ట్రై చేయండి..!

-

అమ్మాయిలు ఏదైనా ఫంక్షన్‌ ఉందంటే.. ముందు బట్టలు ఏం వేసుకోవాలో ప్లాన్‌ చేసుకుంటారు. ఇక ఫంక్షన్ రేపు అనగా.. ముందు రోజు నైట్‌ మెహెందీ పెట్టుకుంటారు. మోచేతుల వరకూ మెహెందీ పెట్టుకుని రెడీ అయితే.. సూపర్‌గా ఉంటాం అని వాళ్లు ఫీల్‌ అవుతారునుకోండి అది వేరే విషయం. అయితే ఫంక్షన్‌ పూర్తవుతుంది.. ఇక నాలుగు రోజుల నుంచి పెట్టుకున్న మెహిందీ ఊడిపోవడం స్టాట్‌ అవుతుంది. దీనివల్ల ఆ చేయి మెహెందీ పెట్టినప్పుడు ఎంత అందంగా ఉందో.. అంతకంటే ఎక్కువ గలీజ్‌గా ఉంటుంది. పూర్తిగా పోదు. కొన్ని చిట్కాలతో ఈ మెహెందీని పూర్తిగా తొలగించేయొచ్చు. అవేంటంటే..

చేతులను శుభ్రం చేసుకునే శానిటైజర్‌, లేదా క్లెన్సర్‌ని చేతులపై వేసుకుని నురగ వచ్చేంత వరకు నీరు పోసి బాగా రుద్దుకోవాలి. తర్వాత కడిగేసుకోవాలి. శానిటైజర్లు చేతుల్లోని క్రిముల్ని చంపేందుకు సహాయపడతాయి. అందువల్ల సాధారణంగా దీనిలో ఆల్కహాల్‌ ఉంటుంది. ఇది చేతులకు ఉన్న మెహందీని తీసేసేందుకూ పనికి వస్తుంది.

చేతిలో కాస్త పంచదార వేసుకుని దానికి నాలుగు చుక్కల కొబ్బరి నూనెను చేర్చండి. ఇది మంచి స్కిన్‌ స్క్రబ్‌లా పని చేస్తుంది. మెహందీ ఎక్కడైతే ఊడిపోవాలనుకుంటున్నారో అక్కడ ఎక్కువ ఒత్తిడిని కలిగిస్తూ రబ్‌ చేసుకోండి. పైన పొట్టులాగా ఉన్న మెహెందీ కాస్త ఊడి వచ్చేస్తుంది.

నిమ్మరసం చర్మాన్ని లైటెన్‌ చేస్తుంది. తెల్లగా మార్చే ఈ లక్షణం వల్ల ఇది మెహందీని వదిలించుకోవడానికి బాగా పని చేస్తుంది. చేతులకు నిమ్మరసాన్ని పట్టించి ఉంచి పావుగంట తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోండి.

మొండి మరకలనైనా తీసివేయగల సత్తా వంట సోడాకు ఉంటుంది. అలాగే ఇది చేతులపై ఉండే మెహందీని వదిలించడంలోనూ ఉపయోగపడుతుంది. ఒక చెంచాడు బేకింగ్‌ సోడాని తీసుకుని చేతుల్లో వేసుకుని ఐదు నిమిషాల పాటు బాగా రుద్దుకుని నీటితో కడిగేసుకోండి. అయితే సోడా చేతులను పొడిబారేలా చేస్తుంది. అందుకే తర్వాత చేతులకు కచ్చితంగా మాయిశ్చరైజర్‌ రాసుకోండి.

జుట్టుకు అప్లై చేసే కండిషనర్‌ చేతుల మెహందీని పోగొట్టుకునేందుకూ వాడవచ్చు. చేతులకు రాసుకుని పది నిమిషాల తర్వాత కడిగేసుకుంటే సరిపోతుంది.

వీటిల్లో మీకు ఏది వీలైతే అది ట్రై చేయండి. రిజల్ట్‌ ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news